Kokum For Piles And Constipation: కోకుమ్‌ పండ్లు కొన్ని రాష్ట్రాల్లోనే లభిస్తాయి. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. దక్షిణ, పశ్చిమ భారతదేశంలోని ప్రత్యేకమైన ఆహారాలు చేసేందుకు వినియోగిస్తారు. దీనిని ఆహారంలో తీసుకోవడం వల్ల ఆకలిని పెంచడమేకాకుండా మలబద్ధకం, దాహం, పైల్స్, గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రభావవంతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా కోకుమ్‌ పండ్ల గురించి ఆయుర్వేద శాస్త్రంలో క్లుపంగా వివరించారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు పూర్వీకులు వేల సంవత్సరాల నుంచి ఈ పండును వినియోగిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పూర్వీకులు ఈ పండును ఇలా వినియోగించేవారు:
ఇది చూడడానికి  ఎరుపు రంగులో ఉన్న శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ పండు తిపి, పులువు రెండు రుచులను కలిగి ఉంటుంది. కాబట్టి భారతీయులు శాఖాహార, మాంసాహార వంటలలో వినియోగించేవారట. అంతేకాకుండా దీని నుంచి తొక్కలను తీసి ఎందబెట్టి  డ్రై ఫ్రూట్‌గా కూడా వినియోగించేవారని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తుందని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కోన్నారు.


డయాబెటిస్‌ నియంత్రణకు ప్రభావవంతంగా సహాయపడుతుంది:
కోకుమ్‌ పండ్లలో పోషక విలువలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్నవారు క్రమం తప్పకుండా ఈ పండ్లను తినడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. దీంతో సులభంగా మధుమేహం నియంత్రణలో ఉంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా కోకుమ్ గింజల నూనెతో సబ్బు, కొవ్వొత్తి, లేపనం మొదలైనవి తయారు చేస్తారు. ప్రతి రోజూ వీటి తాజా రసాన్ని తాగడం వల్ల శరీరానికి చల్లదనం అందుతుంది.


ఇతర ప్రయోజనాలు:
కోకుమ్‌లో 60 కేలరీలు, 14.3 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 1.8 గ్రాముల డైటరీ ఫైబర్, 0.5 గ్రాముల ప్రోటీన్స్‌ లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా వీటిని తినడం వల్ల మలబద్ధకం, దాహం, పైల్స్, గొంతు నొప్పి, ఇతర నొప్పి మొదలైన తీవ్ర వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలీక వ్యాధుల నుంచి కూడా విముక్తి కలిగించేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.


Also Read: Jayamangala Venkataramana: మాజీ ఎమ్మెల్యేకు సీఎం జగన్ బంపర్ ఆఫర్.. టీడీపీకి షాక్..! 


Also Read: Mutual FundS: టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్.. ఇక్కడ పెట్టుబడి పెడితే మంచి లాభాలు 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook