Mutual FundS: టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్.. ఇక్కడ పెట్టుబడి పెడితే మంచి లాభాలు

Top Ten Mutual Funds: ప్రస్తుతం పెట్టుబడిపెట్టేందుకు అనేక మార్గాలు మనకు అందుబాటులో ఉన్నాయి. చాలామంది మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో పెట్టుబడిని కనీస మొత్తంతో కూడా ప్రారంభించవచ్చు. 
 

  • Feb 13, 2023, 23:36 PM IST
1 /5

చాలామంది కొత్త మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్‌మెంట్ ప్రయాణాన్ని ప్రారంభించేటప్పుడు మనకు ఎంత ఆదాయం వస్తుంది..? మనం పెట్టుబడి పెట్టిన డబ్బులు సేఫ్‌గా ఉంటాయా..? అని ఆలోచిస్తారు.  

2 /5

బెస్ట్ మ్యూచువల్ ఫండ్‌ను ఏదో ఎంచుకోవడానికి ప్రస్తుతం అనేక పారామీటర్‌లు ఉన్నాయి. మంచి మ్యూచువల్ ఫండ్‌లను షార్ట్‌లిస్ట్ చేయడానికి వివిధ పద్ధతులు పాటించవచ్చు. వాటి పనితీరు, రిస్క్, సమయం, రాబడి మొదలైనవి అన్ని తెలుసుకోవచ్చు.    

3 /5

అయితే కొందరు వ్యక్తులు పెద్ద పేర్లను చూసిన తర్వాతనే వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. బెస్ట్ మ్యూచువల్ ఫండ్ కోసం అనేక పారామీటర్లు చెక్ చేసుకోవాలి. మన సౌలభ్యం ప్రకారం పెట్టుబడి పెట్టుకోవాలి.  

4 /5

యాక్సిస్ బ్లూచిప్ ఫండ్, మిరే అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్, పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, యూటీఐ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, యాక్సిస్ మిడ్‌క్యాప్ ఫండ్, కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్, యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్, ఎస్‌బీఐ స్మాల్ క్యాప్ ఫండ్, ఎస్‌బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్, మిరే అసెట్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ తదితర మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది.  

5 /5

అయితే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సి విషయం ఏంటంటే.. ఏదైనా మ్యూచువల్ ఫండ్‌లో డబ్బును ఇన్వెస్ట్ చేసేప్పుడు.. మీకు వచ్చే ప్రయోజనాలపై ఎంత శ్రద్ధ వహిస్తారో.. దాని ప్రతికూల విషయాలపై కూడా అదే శ్రద్ధ వహించాలి. మీ అవసరాలకు అనుగుణంగా ఈ మ్యూచువల్ ఫండ్ సరైనదా కాదా అనేది గుర్తుపెట్టుకోవాలి.