Ldl Cholesterol Lowering Exercise: శరీరం ఫిట్‌గా ఉండడానికి తప్పకుండా ప్రతి రోజు వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది ఊబకాయం, ఆందోళన సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా శరీరంలో కొలెస్ట్రాల్‌ పరిమాణాలను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పొట్ట చుట్టు కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రించుకోవాలి. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు ప్రాణాంతంగా మారొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా ఇంట్లో కొన్ని వ్యాయామాలు చేయోచ్చు. ఇలాంటి వ్యాయామాలు చేయడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు దూరం కావడమేకాకుండా శరీరం దృఢంగా మారుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొలెస్ట్రాల్‌ను తగ్గించే వ్యాయామాలు ఇవే:
బోసు బాల్ వ్యాయామం:

ప్రస్తుతం చాలా మంది ఈ వ్యాయామాలు చేస్తున్నారు. ప్రతి రోజు బంతితో బోసు బాల్ వ్యాయామం చేయడం వల్ల సులభంగా చెడు కొలెస్ట్రాల్‌ పరిమాణాలు నియంత్రణలో ఉంటుంది. ఈ వ్యాయామాలు చేయడానికి ముందుగా నేలపై బోసు బంతిని ఉంచాల్సి ఉంటుంది. తర్వాత మీ కాళ్లను నిఠారుగా ఉంచి, చేతులను బోసు బంతి వైపులా ఉంచండి. ఈ క్రమంలో మీ కాలి పాదాల కాలి నేలపైనే ఉండాలి. ఇలా ప్రతి రోజు 10 నుంచి 15 సార్లు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. దీంతో పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్‌ కూడా నియంత్రణలో ఉంటుంది.


[[{"fid":"271514","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]] 


బర్పీలు వ్యాయామం:
శరీర కొలెస్ట్రాల్‌ పేరుకుపోవడం సైలెంట్‌ కిల్లర్‌ లాంటిది. కాబట్టి ఎంత తొందరగా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందితే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని ప్రతి రోజు ఉదయం బర్ఫీ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఈ వ్యాయామాలు ప్రతి రోజు చేయడం వల్ల  మోకాళ్ల నొప్పులు కూడా దూరమవుతాయి. అయితే ఈ వ్యాయామాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వ్యాయామం చేయడానికి.. ముందుగా మీరు నిటారుగా నిలబడాల్సి ఉంటుంది. తర్వాత మోకాళ్లను వంచి.. రెండు చేతులను నేలపై ఉంచాల్సి ఉంటుంది. ఇప్పుడు మీ కాళ్లను వెనుక వైపు వంచాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రోజు 10 నుంచి 20 సార్లు చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా బెల్లీ ఫ్యాట్‌ కూడా దూరమవుతుంది. 


[[{"fid":"271515","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Rohit Sharma-Yashasvi Jaiswal: టీమిండియాలోకి యశస్వి జైశ్వాల్‌.. హింట్‌ ఇచ్చిన కెప్టెన్ రోహిత్‌ శర్మ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.