Litchi Health Benefits in Summer: లిచీ పండు అద్భుతమైన పండు. ఇది తినడానికి రుచిగా ఉంటుంది. అయితే, ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎండకాలం లిచీ పండును మన డైట్లో చేర్చుకుంటే మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. లిచీని తింటే మనకు కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యాంటీ ఆక్సిడెంట్స్..
ఎండకాలం లిచీని మన డైట్లో చేర్చుకుంటే ఎంతో ఆరోగ్యకరం. ఎందుకంటే ఇందులో విటమిన్ సీ, ఫ్లవనాయిడ్స్ ఉంటాయి.  ఇది మన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ సమస్య నుంచి కాపాడి కణాలు పాడవ్వకుండా సహాయపడుతుంది.


ఇమ్యూనిటీ బూస్ట్‌..
లిచీలో విటమిన్‌ సీ ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి. అంతేకాదు ఎండకాలం వచ్చే సీజనల్ జబ్బుల నుంచి మనల్ని కాపాడుతుంది.


హైడ్రేటింగ్‌..
లిచీని ఎండకాలం మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల మన శరీరానికి రోజంతటికీ కావాల్సినంత హైడ్రేషన్‌ను అందిస్తుంది. ఎందుకంటే లిచీలో నీటి శాతం అధికంగా ఉంటుంది.


మెరుగైన జీర్ణక్రియ..
లిచీలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మెరుగైన జీర్ణక్రియకు తోడ్పడుతుంది. అంతేకాదు మలబద్ధకం సమస్య నుంచి కాపాడుతుంది.


బరువు నిర్వహణ..
లిచీ రుచి తీయ్యగా ఉంటుంది. కానీ, ఇందులో క్యాలరీలు తక్కువ మోతాదులో ఉంటాయి. లిచీలో కొవ్వులు కూడా తక్కువగా ఉంటాయి. మామిడిపండు తినాలని కోరిక ఉంటుంది. క్యాలరీలు ఎక్కువగా ఉంటాయని వెనక్కి తగ్గుతారు. వారు లిచీని తినవచ్చు. బరువు పెరగకుండా ఉంటారు.


ఇదీ చదవండి: నల్ల నువ్వులు మీరు నమ్మలేని 8 ఆరోగ్య ప్రయోజనాలు..


బ్లడ్‌ ప్రెజర్..
లిచీలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది బ్లడ్‌ ప్రెజర్ స్థాయిలను నిర్వహిస్తాయి. గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి.


ఎనర్జీ బూస్ట్‌..
లిచీలో సహజసిద్ధమైన చక్కెలరలు ఉంటాయి. ఇవి మన శరీరానికి తక్షణ శక్తినిస్తాయి.


రక్తప్రసరణ మెరుగు..
లిచీలో రాగి, విటమిన్ బీ కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటుంది. ఇవి ఎర్ర రక్తకణాలను పెంచుతాయి. మెరుగైన రక్తప్రసరణకు ప్రేరేపిస్తాయి.


ఇదీ చదవండి: మీకు కొలెస్ట్రాల్ ఉంటే ఈ 4 ఆహార పదార్థాలను ఎప్పుడూ ముట్టుకోకూడదు.. ఎందుకో తెలుసా..?


యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు..
లిచీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. సన్ బర్న్, ఎండ వేడిమి నుంచి కలిగే ర్యాష్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.


చర్మ ఆరోగ్యం..
లిచీల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని సన్‌ డ్యామేజ్ నుంచి కాపాడి త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా నివారిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook