ఆధునిక జీవనశైలిలో చాలామంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. బరువు తగ్గేందుకు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొన్ని పరిస్థితుల్లో ఏం చేయకుండానే బరువు తగ్గుతుంటారు. ఇలా జరగడం మంచిది కానే కాదు. వెంటనే అప్రమత్తం కావల్సి ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అకారణంగా ఎప్పుడైనా బరువు తగ్గుతున్నప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. తేలిగ్గా తీసుకోకుండా వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది గంభీరమైన వ్యాధులకు సంకేతం కావచ్చు. హఠాత్తుగా బరువు తగ్గడానికి ఏయే కారణాలున్నాయో తెలుసుకుందాం..


డయాబెటిస్


ఒకవేళ మీరు హఠాత్తుగా బరువు తగ్గుతుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తేలిగ్గా తీసుకోవద్దు. ఎందుకంటే డయాబెటిస్ ఉంటే ఇలానే జరుగుతుంది. అంతేకాదు..డయాబెటిస్ సమస్య ఉన్నప్పుడు బాడీలో ఇంకా చాలా సమస్యలు ఉత్పన్నమౌతాయి. అందుకే బరువు తగ్గడం ఆందోళన కల్గించే అంశమే అవుతుంది. 


డిప్రెషన్


చాలా సందర్భాల్లో డిప్రెషన్ కారణంగా బరువు హఠాత్తుగా తగ్గుతుంటారు. ఎందుకంటే డిప్రెషన్ ఉన్నప్పుడు మనిషి..ఉదాసీనంగా, ఒంటరిగా, ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటాడు. ఈ పరిస్థితుల్లో ఆకలి ఉండదు. ఫలితంగా బరువు తగ్గిపోతుంటారు. 


కేన్సర్


కేన్సర్ ఉన్నప్పుడు ముందుగా కన్పించే లక్షణం బరువు హఠాత్తుగా తగ్గడం. కేన్సర్ సోకితే ప్రారంభంలో జ్వరం, అలసట, బరువు తగ్గడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. అందుకే ఆకారణంగా బరువు తగ్గడం ప్రారంభమైతే నిర్లక్ష్యం చేయవద్దు. 


గుండె రోగాలు


మీరు ఏ పనీ చేయకుండా, ఎలాంటి వ్యాయామం లేదా డైటింగ్ చేయకుండా బరువు తగ్గుతుంటే నిర్లక్ష్యం ప్రదర్శించకుండా వైద్యుడిని సంప్రదించాలి. బరువు తగ్గడం గుండె సంబంధిత వ్యాధి లక్షణం కావచ్చు.


Also read: Winter Tips: చలికాలంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ తప్పుగా చూపిస్తాయా, కారణమేంటి, ఏం చేయాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook