Lower Back Pain Treatment: విపరీతమైన వెన్ను నొప్పులతో బాధపడుతున్నారా? అయితే చిట్కాలు పాటించండి!
Lower Back Pain Treatment At Home: ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల చాలా మందిలో వెన్ను నొప్పులు వస్తున్నాయి. దీని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఈ కింది చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
These 5 Tips Can Get Relief Back Pain In 2 Days: గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల వెన్ను నొప్పులతో పాటు ఇతర సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలా కూర్చోవడం వల్ల నొప్పులే కాకుండా కొలెస్ట్రాల్ కూడా పేరుకుపోతోందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. విపరీతమైన నొప్పుల కారణంగా కండరాలు బలహీనంగా మారుతున్నాయి. కాబట్టి ఇలాంటి నొప్పులతో బాధపడేవారు తప్పకుండా పలు చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి రోజూ వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సులభంగా వెన్ను నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వెన్నెముకలో చాలా చిన్న ఎముకలు ఉంటాయి. వాటిని వెన్నుపూస అని పిలుస్తారు. మెడలో 7, వెనుక భాగంలో 12, నడుములో 5 ఎముకల కలయికలతో ఉంటుంది. అయితే వీటిలో మార్పులు వస్తే వెన్నుపాములో కూడా తీవ్ర సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వెన్నుపాము కింద ఉన్న నరాలలో మార్పులు రావడం వల్ల కూడా తీవ్ర వెన్ను నొప్పులు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఇలాంటి నొప్పులు రాకుండా ఉండడానికి పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
వెన్నెముకను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం:
వెన్నెముకలో ఎముకలు వయస్సుతో పాటు పెరుగుతాయి. అంతేకాకుండా ఎముకల్లో క్యాల్షియం, ప్రొటీన్లు నిల్వ ఉంటాయి. పీక్ బోన్ మాస్ సుమారు 25 సంవత్సరాల వయస్సులో వస్తుంది.. అంటే ఆ క్రమంలోనే ఎముకలు పూర్తిగా అభివృద్ధి చెందుతాయి. దీంతో దృఢంగా మారుతాయి. పిల్లల ఎత్తు పెరడానికి 25 సంవత్సరాలలోపే ప్రోటీన్, కాల్షియం కలిగిన ఆహారాలు ప్రతి రోజూ ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే శరీరంలో ఎముకల నిర్మాణం బలహీనంగా మారే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
శారీరక అలసత్వం ఒక పెద్ద కారణం:
పూర్వీకులు పొలాల్లో లేదా పెంపుడు జంతువుల సంరక్షణలో చాలా శారీరక శ్రమ చేసేవారు..అదే సమయంలో ఇండ్లలో మహిళలు కూలి పనులు చేయాల్సి వచ్చేది. కాబట్టి కాలం మారుతున్న కొద్ది శరీరక శ్రమ భారీగా తగ్గిపోయింది. దీంతో కండరాల దృఢత్వం తగ్గిపోయింది. ప్రస్తుతం అనుసరిస్తున్న జీవన శైలిలో చాలా మంది రోజంతా కూర్చుని, సాయంత్రం వచ్చి టీవీ చూస్తూ కూర్చున్నాడు. అలాగే ఒకటే భంగిమలో కూర్చోవడం వల్ల తీవ్ర నొప్పుల సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒకే చోట కూర్చోకుండా అప్పుడప్పుడు నడవాల్సి ఉంటుంది.
Also read: AP 10th Exams: పదవ తరగతి పరీక్షకు అంతా సిద్ధం, ఏప్రిల్ నెలాఖరులోనే ఫలితాలు
Also read: AP 10th Exams: పదవ తరగతి పరీక్షకు అంతా సిద్ధం, ఏప్రిల్ నెలాఖరులోనే ఫలితాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook