Mango Benefits: రోజూ మామిడి పండు తినడం వల్ల ఈ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు!
Mango Benefits: వేసవి అంటేనే మామిడి పండ్ల సీజన్! మామిడి పండ్లు రుచిలో అద్భుతంగా ఉండడం సహా అనేక రకాల ప్రయోజనాలను చేకూరుస్తాయి. అయితే మామిడి పండ్లు తినడం వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
Mango Benefits: పండ్లలో రారాజు మామిడి పండు అని అందరికి తెలిసిందే! రంగులోనే కాకుండా రుచిలోనూ మామిడి అద్భుతం. బహుశా అందుకేనేమో దాన్ని రారాజు అని సంబోధించి ఉంటారు. వేసవిలోనే అందుబాటులో ఉండే ఈ పండు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. జీర్ణక్రియ మెరుగు..
మీకు జీర్ణ సమస్యలు ఉన్నట్లయితే మామిడి పండు మీకు చక్కని పరిష్కారంగా మారుతుంది. మామిడి పండులో డైజెస్టివ్ ఎంజైములు ఉంటాయి. ఇందులో నీటి శాతం, ఫైబర్.. శరీరంలోని అతిసారం, మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతాయి.
2. రోగనిరోధక శక్తిని పెరిగేందుకు..
మామిడి పండ్లలో సరిపడా విటమిన్ - ఏ ఉంటుంది. ఇందులో విటమిన్ - సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. వీటితో పాటు మామిడి పండులో కాపర్, ఫోలేట్, విటమిన్ ఇ, విటమిన్ బి వంటి విటమిన్లు, ఖనిజాలు అదనంగా లభిస్తాయి. వాటి వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
3. మెరిసే చర్మం కోసం..
మామిడి పండులో విటమిన్ సి, విటమిన్ ఎ ఉన్నాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. రోజూ సరైన మోతాదులో మామిడి పండ్లను తింటే కొద్ది రోజుల్లోనే మీ చర్మపు మచ్చలు మాయమవుతాయి.
4. గుండెకు మంచిది
పండ్ల రారాజు మామిడి మనల్ని గుండె జబ్బుల నుంచి కూడా కాపాడుతుంది. ఫైబర్, పొటాషియం వాటి వల్ల గుండె నుంచి ప్రవహించే ధమనులలో ఎలాంటి అడ్డంకి లేకుండా కాపాడుతాయి. పాలీఫెనాల్ బయోయాక్టివ్‌గా ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
5. బరువు తగ్గేందుకు
మామిడి పండ్లను తినడం వల్ల శరీర బరువును నియంత్రించుకోవచ్చు. మామిడి తొక్కలో ఫైటోకెమికల్ ఉంటుంది. ఇది సహజ కొవ్వును కరిగేలా చేస్తుంది. అంటే శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. డైటరీ ఫైబర్ మామిడిలో ఉంటుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. మీరు అధిక ఫైబర్ పండ్లు లేదా కూరగాయలు తిన్నప్పుడు, మీరు ఎక్కువసేపు ఆకలితో ఉండరు. దీని వల్ల అతిగా ఆహారాన్ని తినకుండా ఉండేందుకు మామిడి పండ్లు సహకరిస్తాయి.
Also Read: Anger Management: మీకు పట్టరాని కోపం వచ్చినప్పుడు ఈ టిప్స్ పాటిస్తే టెన్షన్ పెరగదు!
ALso Read: Kidney Affecting Food: కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎట్టిపరిస్థితిలోనూ వీటిని తినకూడదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook