Anger Management: కోపం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని అందరికి తెలిసిన విషయమే! కొన్నికొన్ని సందర్భాల్లో మనిషి తన ఓపిన నశించిన తర్వాత కోపోద్రిక్తుడవుతాడు. ఆ కోపం కారణంగా హార్మోన్లపై ఒత్తిడి పెరగడం ప్రారంభమవుతుంది. ఈ కారణంగా టెన్షన్ పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల హైబీపీ బారిన పడే అవకాశం ఉందని అంటున్నారు. వీటి కారణంగా బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ హెమరేజ్ వంటి సమస్యలు ఏర్పడవచ్చు. అలాంటి వారు మీ కోపాన్ని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. అయితే కోపాన్ని తగ్గించుకునేందుకు మీరు కొన్ని చిట్కాలను పాటించండి.
యోగా అలవాటుతో..
యోగా చేయడం వల్ల కోపాన్ని కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు. మీరు కూడా పట్టరాని కోపంతో బాధపడుతుంటే.. రోజూ యోగా చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ కోపం తగ్గుతుంది.
ప్రతిరోజూ వ్యాయామంతో..
అంతే కాకుండా రోజూ వ్యాయామం చేస్తే కోపం తగ్గుతుంది. వ్యాయామం అంటే మీరు నడకతో స్టార్ట్ చేయవచ్చు. వ్యాయామం చేయడం వల్ల మీ హర్మోన్లపై ఒత్తిడిని తగ్గిస్తుంది.
ధ్యానం చేస్తే కోపం తగ్గుతుంది
అనేక సమస్యలకు ధ్యానం మందు అని మన పెద్దలు అంటుంటారు. మీరు ధ్యానం చేస్తే.. అనేక దీర్ఘకాలిక వ్యాధులు కూడా మీ నుంచి దూరమయ్యే అవకాశం ఉంది. కోపం వచ్చినప్పుడు గట్టిగా శ్వాస తీసుకోవాలి. అలా చేయడం వల్ల మీ రక్తపోటు పెరగదు.
సంగీతం వింటే మానసిక స్థితి మెరుగు..
మంచి సంగీతం మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అంటే మంచి మ్యూజిక్ వినడం వల్ల టెన్షన్ తగ్గుతుంది. చెవులకు ఇంపుగా ఉంటే పాటలను వినడం వల్ల కోపాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు.
(నోట్: ఈ సమాచారమంతా కొన్ని చిట్కాల నుంచి గ్రహించబడినది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)
Also Read: Corona Symptoms: కరోనా ఫోర్త్ వేవ్.. కొవిడ్ బారిన పడిన వారిలో ఈ కొత్త లక్షణాలు!
Also Read: Summer Drinks: ఎండల కాలంలో ఈ ఆరోగ్యకరమైన నేచురల్ పానీయాలను ట్రై చేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook