Mango Eating Tips: మామిడి పండు తినే ముందు ఈ పని తప్పకుండా చేయండి..లేందటే శరీరానికి నష్టమే..!!
Mango Eating Tips: మామిడిపండును తినడానికి ముందు కాసేపు నీటిలో నానబెట్టాలి. ఎందుకంటే అలా చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నానబెట్టిన మామిడిపండు మనకు ఎందుకు మేలు చేస్తుందో తెలుసుకుందాం...
Why We Should Soak Mangoes in Water Before Eating: కొంత మందికి వేసవి కాలం అంటే అస్సలు ఇష్టముండదు. ఎందుకంటే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మండుతున్న ఎండల వల్ల వచ్చే చెమట శరీరానికి హాని కలిగిస్తాయి.. అయితే వేసవి కాలం అంటే చాలా మంది ఇష్టపడేవారు కూడా ఉన్నారు. దీనికి కారణం వేసవిలో మామిడి వంటి రుచికరమైన పండ్లు లభించడం. కానీ మామిడి పండ్లు తినే విషయంలో జాగ్రత్త అవసరమని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నానబెట్టిన మామిడిపండు తినడం వల్ల 4 ప్రయోజనాలు:
మామిడిపండును తినడానికి ముందు కాసేపు నీటిలో నానబెట్టాలి. ఎందుకంటే అలా చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నానబెట్టిన మామిడిపండు మనకు ఎందుకు మేలు చేస్తుందో తెలుసుకుందాం...
1. చర్మ సమస్యలను నివారించడం:
మామిడిపండు తినడం వల్ల ముఖంపై మొటిమలు రావడం మొదలవుతాయని మనందరికీ తెలుసు. నానబెట్టిన మామిడి పండ్లను తింటే ఇలాంటి సమస్యలు తగ్గుతాయి.
2. శరీరానికి చల్లదనం:
మామిడి పండు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. దీని కారణంగా థర్మోజెనిసిస్ ఉత్పత్తి కూడా అధికంగా పెరుగుతుంది. మామిడిని నానబెట్టిన తర్వాత తింటే అలాంటి సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు.
3. రసాయనాలను నివారించడం:
మామిడి పండు పండినప్పుడు, పురుగుల నుంచి రక్షించడానికి పురుగుమందు వాడతారు. అయితే ఇది కళ్ళు, చర్మానికి చికాకు కలిగిస్తుంది. అంతే కాకుండా ఆరోగ్యానికి ప్రమాదం తెచ్చిపెడుతుంది. దీనితో పాటు తలనొప్పి, వాంతులు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
4. శరీరంలో కొవ్వు తగ్గుతుంది:
మామిడిలో ఫైటోకెమికల్ ఉంటుంది. ఇది శరీరంలో కొవ్వు పెరుగుదలకు దోహదనడుతుందని నిపుణులు అంటున్నారు. అరగంట పాటు నానబెట్టిన మామిడి పండ్లను తినడం ద్వారా బరువును తగ్గిస్తుందిని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: The Rock Diamond Auction: వేలంలోకి రానున్న అతి పెద్ద వజ్రం ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook