Measles vaccine vs Coronavirus: మీజిల్స్..బీసీజీ వ్యాక్సిన్లు. చిన్నతనంలో తప్పనిసరిగా ఇచ్చే వ్యాక్సిన్లు. ఇప్పుడీ వ్యాక్సిన్లే మన చిన్నారుల్ని కరోనా మహమ్మారి నుంచి రక్షిస్తున్నాయా..అవునంటున్నారు. పూణే పరిశోధకులు. వివరాలిలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా థర్డ్‌వేవ్ ( Corona Third Wave) చిన్నారులపై ఎక్కువగా ప్రభావం చూపుతుందనే వార్తలు ఇప్పటికే ఆందోళన కల్గిస్తున్నాయి. ఈ తరుణంలో పూణే బీజే మెడికల్ కళాశాల పరిశోధకులు(Pune Medical Researchers) గుడ్‌న్యూస్ అందిస్తున్నారు. చిన్నారులకు మీజిల్స్ అంటే తట్టు వ్యాధి రాకుండా మీజిల్స్ వ్యాక్సిన్ వేస్తుంటాం. పుట్టిన వెంటనే బీసీజీ వ్యాక్సిన్(BCG Vaccine) ఇస్తుంటాం. వీటివల్ల ఆ చిన్నారులకు కోవిడ్ నుంచి రక్షణ లభిస్తున్నట్టు పరిశోధనలో తేలిందని పూణే పరిశోధకులు చెబుతున్నారు. ఒకవేళ ఈ వ్యాక్సిన్ తీసుకున్న పిల్లలకు కోవిడ్ సోకినా..ప్రభావం చాలా తక్కువగా ఉంటున్నట్టు స్పష్టమైందన్నారు. కరోనా వైరస్‌పై మీజిల్స్ వ్యాక్సిన్ 87.5 శాతం సమర్ధవంతంగా పనిచేస్తున్నట్టు పూణే మెడికల్ కళాశాళ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. 


హ్యూమన్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునోథెరప్యూటిక్స్ జర్నల్‌లో ఈ కథనం ప్రచురితమైంది. చిన్నారుల్లో మీజిల్స్ వ్యాక్సిన్(Measles Vaccine Protects from Coronavirus) కోవిడ్ నుంచి దీర్ఘకాలిక రక్షణ అందిస్తున్నట్టు పరిశోధకులు తెలిపారు. మీజిల్స్ వ్యాక్సిన్ కారణంగా చిన్నపిల్లలకు కరోనా నుంచి రక్షణ లభిస్తుండటం నిజమే అయినా మరింతగా పరిశోధనలు జరగాల్సి ఉంది. ఈ తరహా అధ్యయనం ప్రపంచంలో ఇదే తొలిసారని తెలుస్తోంది. అందుకే మీజిల్స్ (Measles Vaccine) డోసు తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని, తొలి డోసు తీసుకున్న వారు తప్పనిసరిగా రెండో డోసు వేయించుకోవాలని పరిశోధకుల్లో ఒకరైన డాక్టర్ నీలేశ్ సూచించారు.ఈ అధ్యయనాన్ని17 ఏళ్ల వయసున్న 548 మందిని రెండు గ్రూపులుగా విభజించి ఏడాదిపాటు పరిశోధనలు నిర్వహించారు. మీజిల్స్, బీసీజీ వ్యాక్సిన్లు కరోనా నుంచి పిల్లలకు రక్షణ కల్పిస్తున్నట్టు తేలిన ఈ  అధ్యయనం ప్రాధాన్యంత సంతరించుకుంది.


Also read: COVID-19 New Wave: కరోనా కొత్త వేవ్ ఏర్పడేందుకు దారితీసే 4 పరిస్థితులు ఇవే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook