Healthy lifestyle : నవరాత్రుల్లో ఫాస్టింగ్ చేస్తున్నారా అయితే కచ్చితంగా ఈ ఫ్రూట్ మీకోసమే..
Dragon fruit: మార్కెట్లో ఎన్నో రకాల పండ్లు దొరుకుతాయి.. అయితే విచిత్రమైన ఆకారంతో చూడగానే డ్రాగన్ ని తలపిస్తూ నోరూరించే డ్రాగన్ ఫ్రూట్ చాలామంది ఇష్టంగా తింటారు. అయితే కొంతమంది ఆ ఫ్రూట్ వల్ల ఎటువంటి పోషక విలువలు అందవు అని భావిస్తారు. కానీ డ్రాగన్ ఫ్రూట్ గురించి వైద్యులు ఏం చెబుతున్నారో మీకు తెలుసా?
Navratri fasting:
డ్రాగన్ ఫ్రూట్ అనేది అలా హెల్తి ఫుడ్. ఇది మన శరీరంలోని వ్యాధులను నయం చేయడమే కాకుండా శరీరానికి అవసరమైన తేమ శాతాని కూడా అందిస్తుంది. పైగా ఇందులో బోలెడు పోషక విలువలు ఉన్నాయి. ఈ పండు సహజంగా కాంతివంతంగా మార్చడంతో పాటు ముఖం మీద మచ్చలు, మొటిమలు తగ్గిస్తుంది. చాలామందికి స్కిన్ డ్రైగా, డల్ గా ఉంటుంది. అలాంటివారు డ్రాగన్ ఫ్రూట్ కి ఎక్కువ తీసుకోవడం వల్ల స్కిన్ బౌన్సీగా ,ఎంతో మృదువుగా మారుతుంది.
ఇక ఈ పండు తింటే గుండె సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయి. డయాబెటిస్ పేషెంట్స్ కూడా దీన్ని తినొచ్చు ఎందుకంటే ఇది మన రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. అయితే షుగర్ పేషెంట్స్ మాత్రం ఈ ఫ్రూట్ తినాలి అంటే ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించాలి. డ్రాగన్ ఫ్రూట్ కనీసం వారానికి రెండు మూడు సార్లు అన్న తింటూ ఉంటే మన జుట్టు ఎదుగుదల ఉంటుంది.
మరీ ముఖ్యంగా మీరు నవరాత్రుల్లో ఫాస్టింగ్ చేస్తూ ఉంటే మాత్రం మీకు ఈ డ్రాగన్ ఫ్రూట్ నిజంగా ఒక వరం అని చెప్పవచ్చు. ఫాస్టింగ్ సమయంలో ఈ ఫ్రూట్ తీసుకున్న వాళ్లకి శరీరానికి అవసరమైన ఫైబర్ కంటెంట్ తో పాటు వాటర్ కంటెంట్ కూడా అందుతుంది. కడుపు ఫుల్లుగా ఉన్నట్టు అనిపించడంతో పెద్ద ఆకలి కూడా వేయదు. ఇక ఇది చెప్పు ఎనర్జీతో మీరు రోజంతా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. డ్రాగన్ ఫ్రూట్ లో ఎక్కువ మోతాదులో లభించే కాల్షియం కంటెంట్ మీ శరీరంలోని ఎముకలను దృఢంగా మారుస్తుంది. ఇలా ఒకటేమిటి శరీరంలోని పలు రకాల సమస్యలకు డ్రాగన్ ఫ్రూట్ చక్కటి ఉపాయం. మరి ఆలస్యం చేయకుండా డ్రాగన్ ఫ్రూట్ ని మీ డైట్ లో భాగంగా చేసుకోండి.
గమనిక:
పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచన మేరకు సేకరించడం జరిగింది. దీన్ని పాటించే ముందు మీ డాక్టర్ని ఒకసారి సంప్రదించండి.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..