Monkey Pox Vaccine: మంకీపాక్స్. ఎంపాక్స్‌గా పిల్చుకునే ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ ఎమర్జెన్సీగా కూడా ప్రకటించింది. కరోనా మహమ్మారి తరువాత ఇంచుమించు ఆ స్థాయిలో భయపెడుతోంది. ఇండియాలో కూడా తొలి కేసు వెలుగుచూసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంకీపాక్స్ అలియాస్ ఎంపాక్స్. ప్రపంచదేశాల్లో ఇప్పుడీ వైరస్ కలకలం రేపుతోంది. వాస్తవానికి ఇది పాత వ్యాధే అయినా ఇప్పుడు కొత్తగా భయపెడుతోంది. 2022లో ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను ఎంపాక్స్‌గా పేరు మార్చింది. ఎంపాక్స్ అనేది ఓ ప్రమాదకరమైన స్ట్రెయిన్. మొట్టమొదటిసారిగా కాంగాలో వెలుగు చూసి అక్కడి నుంచి పొరుగు దేశాలకు  ఆ తరువాత అమెరికా, ఆసియాకు వ్యాపించింది. ఇది ఏ స్థాయిలో వ్యాపిస్తుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతానికి ఆఫ్రికా, యూరోపియన్ దేశాల్లో తీవ్రంగానే ఉంది. 


మంకీపాక్స్ అనేది శరీరంలో ప్రవేశించిన తరువాత 3 వారాల్లోగా బయటపడవచ్చు. జ్వరం, శరీరంపై పొక్కులు, గొంతు ఎండిపోవడం, తల నొప్పి, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, నిస్సత్తువ వంటివి ప్రధానంగా కన్పిస్తాయి. ఈ వ్యాధి కూడా రోగ నిరోధక శక్తిపై ఆధారపడి ఉంటుంది. 


మంకీపాక్స్ అలియాస్ ఎంపాక్స్‌కు వ్యాక్సిన్


అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయంలో శుభవార్త అందించింది. మంకీపాక్స్‌కు వ్యాక్సిన్ వచ్చిందని ప్రకటించింది. MVA-BN వ్యాక్సిన్‌ను మంకీపాక్స్ వ్యాక్సిన్‌గా గుర్తించారు. వాస్తవానికి బవేరియన్ నార్డిక్ కంపెనీ తయారు చేసిన ఈ వ్యాక్సిన్ చికెన్ పాక్స్ వ్యాక్సిన్. కానీ మంకీపాక్స్ కేసుల్లో 76 శాతం ప్రభావం చూపిస్తోందని తేలింది. నాలుగు వారాల వ్యవధిలో రెండు డోస్‌లతో ఈ వ్యాక్సిన్ ఇస్తారు. 18 ఏళ్లు దాటినవారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వవచ్చు. రెండు డోస్‌లు తీసుకున్నవాళ్లు 82 శాతం రక్షణ పొందుతున్నట్టు అధ్యయనాల్లో తేలింది. 


స్మాల్‌పాక్స్, ఎంపాక్స్ రెండింటికీ కారణమైంది ఒకే వైరస్ అవడం వల్ల లక్షణాలు కూడా దాదాపుగా ఒకేలా ఉంటాయి. జ్వరం, స్కిన్ ర్యాషెస్, నీరసం, కండరా నొప్పుల, నిస్సత్తువ, మంఫ్స్ వంటివి ఉంటాయి. కరోనా మహమ్మారి విషయంలో తీసుకునే జాగ్రత్తలు ఇక్కడ కూడా తీసుకోవల్సి ఉంటుంది. 


ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశీలనలో మరో వ్యాక్సిన్


మంకీపాక్స్ మహమ్మారి ఆఫ్రికాలో విజృంభిస్తోంది. గత వారం రోజుల వ్యవధిలో ఎంపాక్స్ కారణంగా ఆఫ్రికాలో 107 మంది మృత్యువాత పడగా 3,160 కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ బవేరియన్ నోర్డిక్ సంస్ఖకు చెందిన MVA-BNకు అనుమతి ఇచ్చింది. జపాన్‌కు చెందిన కేఎం బయోలాజిక్స్ సంస్ఖకు చెందిన LC 16 వ్యాక్సిన్ కూడా ఇప్పుడు పరిశీలనలో ఉంది. 


Also read: Lemon Water Remedies: రోజూ నిమ్మరసం తాగితే ఏమౌతుంది, ఎలాంటి మార్పులు కన్పిస్తాయి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.