Monsoon Diseases Prevention: వేడి, ఉక్కపోత దాటుకుని చిరుజల్లులతో సేదతీరుతున్న ఈ వర్షాకాలం ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఈ కాలంలో రోగనిరోధక శక్తి బలహీనపడే అవకాశం ఎక్కువ. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వర్షాకాలంలో వచ్చే అనారోగ్యాలను నివారించవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాతావరణ మార్పులు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. రోజురోజుకి పెరుగుతున్న వేడి, ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు, వర్షపాతంలో మార్పులు వంటివి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ కారణంగా ఈ సీజన్‌లో సాధారణంగా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులు పెరిగిపోతున్నాయి. జలుబు, జ్వరం వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా వచ్చేస్తాయి. చాలా మంది ఈ సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమయంలో పోషకరమైన ఆహార తీసుకోవడం మంచిది. అలాగే ఆయుర్వేద టీ, పానీయాలు తీసుకోవడం చాలా మంచిది. 


అలాగే రుతుపవనాల రాకతో పాటు వర్షాలు పెరగడం, నీరు ఎక్కడపడితే అక్కడ నిలిచిపోవడం వల్ల దోమల పెరుగుదలకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. దీనివల్ల మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు వ్యాప్తి చెందే ప్రమాదం పెరుగుతుంది. వర్షపు నీరు ఎక్కడపడితే అక్కడ నిలిచిపోవడం వల్ల దోమలు గుడ్లు పెట్టడానికి అనుకూలమైన ప్రదేశాలు ఏర్పడతాయి. దోమలు మలేరియా , డెంగ్యూ వైరస్‌లను వ్యాప్తి చేస్తాయి. ఈ వ్యాధులు తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వికారం వంటి లక్షణాలను కలిగిస్తాయి. డెంగ్యూ జ్వరం నిజంగా ఒక తీవ్రమైన వ్యాధి ఇది ప్రాణాంతకంగా కూడా మారే అవకాశం ఉంది. డెంగ్యూ వైరస్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఈ వైరస్‌ను ఏడిస్ ఈజిప్టి ఏడిస్ ఎల్బోపిక్టస్ అనే రెండు రకాల దోమలు మనుషులకు వ్యాప్తి చేస్తాయి.  


దీంతో పాటు  కలరా ఒక తీవ్రమైన అంటువ్యాధి. ఇది కలుషిత నీరు లేదా ఆహారం ద్వారా వ్యాపిస్తుంది. ఇది తీవ్రమైన విరేచనాలు, వాంతులు, డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. ఇది చికిత్స చేయకుండా వదిలివేస్తే ప్రాణాంతకం కావచ్చు. టైఫాయిడ్ జ్వరం అనేది సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే ఒక సంక్రమణ వ్యాధి. ఇది సాధారణంగా కలుషితమైన ఆహారం లేదా నీటిని తినడం లేదా తాగడం వల్ల వ్యాపిస్తుంది. ఈ టైఫాయిడ్ జ్వరానికి ప్రాథమిక చికిత్స యాంటీబయాటిక్‌లు. తగినంత విశ్రాంతి, ద్రవాలు తీసుకోవడం కూడా ముఖ్యం.



హెపటైటిస్ ఎ అనేది హెపటైటిస్ ఎ వైరస్ (HAV) వల్ల కలిగే ఒక వ్యాధి, ఇది కాలేయానికి ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. ఈ వైరస్ సాధారణంగా కలుషితమైన ఆహారం లేదా నీటిని తినడం లేదా తాగడం వల్ల వ్యాపిస్తుంది. హెపటైటిస్ ఎ కి నిర్దిష్ట చికిత్స లేదు. చికిత్స లక్షణాలను నిర్వహించడం. శరీరం వైరస్‌తో పోరాడటానికి సహాయపడటంపై దృష్టి పెడుతుంది. ఇందులో విశ్రాంతి, ద్రవాలు తీసుకోవడం ఆరోగ్యకరమైన ఆహారం తినడం వంటివి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో, మందులు కూడా సూచించబడవచ్చు.


గమనిక:


ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మీకు ఎదైనా సందేహం ఉంటే వైద్యుడిని కలసి మాట్లాడటం చాలా అవసరం.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి