Monsoon Health Care: వర్షాకాలంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఈ వ్యాధులు తప్పవు
Monsoon Health Care: భగభగమండే ఎండ వేడిమి నుంచి వర్షకాలం ఉపశమనం కల్గించినా వ్యాధుల ముప్పు మాత్రం వెంటాడుతుంటుంది. వర్షాకాలంలో సహజంగానే సీజనల్ వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితి నుంచి ఎలా ఉపశమనం పొందాలనేది తెలుసుకుందాం..
Monsoon Health Care: వర్షాకాలంలో ఆహ్లాదకరంగా ఉన్నా ఆరోగ్యపరంగా అంత మంచిది కాదు. వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు వెంటాడుతుంటాయి. ముఖ్యంగా మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ ఇతర వైరల్ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే వర్షాకాలంలో సాధ్యమైనంతవరకూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది.
వర్షాకాలం వచ్చిందంటే పలు వ్యాధులు ఉత్పన్నమౌతుంటాయి. ముఖ్యంగా శ్వాస సంబంధ వ్యాధులు ఎదురౌతుంటాయి. ఆస్తమా, లేదా శ్వాస సంబంధ సమస్యలుండేవారికి వర్షాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువౌతుంటుంది. శ్వాస తీసుకునేటప్పుడు వాతావరణంలో ఉండే జర్మ్స్ శరీరంలోపలకు వెళ్లిపోతుంటాయి. ఫలితంగా పరిస్థితి మరింత విషమిస్తుంటుంది. వర్షాకాలంలో ఎదురయ్యే మరో సమస్య దగ్గు. జలుబ, దగ్గుతో పాటు శ్వాసకోశ వ్యాధులు అధికంగా ఉంటాయి. వర్షాకాలంలో ఎదురయ్యే శ్వాస సంబంధిత వ్యాధుల గురించి తెలుసుకుందాం..
వర్షాకాలంలో జలుబు మరో ప్రధాన సమస్య. ఈ సమస్య ఎక్కువగా చిన్నారుల్లో ఉంటుంది. అందుకే వర్షాకాలంలో చిన్నారుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎదురౌతాయి. వర్షాకాలంలో ఎదురయ్యే మరో ప్రధాన సమస్య నిమోనియా. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ కారణంగా ఈ వ్యాధి తలెత్తుతుంటుంది. నిమోనియాకు కారణం బ్యాక్టీరియా, వైరస్. వర్షకాలం వచ్చిందంటే చాలు నిమోనియా కేసులు పెరుగుతుంటాయి. నిమోనియో నుంచి కాపాడుకోవాలంటే ఇమ్యూనిటీ పటిష్టంగా ఉండాలి.
వర్షాకాలంలో వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు సోకకుండా ఉండాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండేట్టు చూసుకోవాలి. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. చేతులు శుభ్రం చేసుకోకుండా ఎలాంటి వస్తువులు ముట్టుకోకూడదు. శానిటైజర్ వినియోగిస్తే మరీ మంచిది. వర్షాకాలంలో నిద్ర సంపూర్ణంగా ఉండేట్టు చూసుకోవాలి. అంటే రోజుకు కావల్సిన 7-8 గంటల నిద్ర కచ్చితంగా అవసరం.
Also read: Belly Fat Diet: ఏం చేసిన బెల్లీ ఫ్యాట్ తగ్గడం లేదా? ఈ 4 చిట్కాలు పాటిస్తే వేగంగా తగ్గించుకోవచ్చట
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook