Honey Precautions: తేనెతో ఈ 5 పదార్ధాలు కలిపి తీసుకుంటున్నారా, అంతే సంగతులు
Honey Precautions: తేనె ఆరోగ్యపరంగా చాలా అద్భుతమైంది. ఆయుర్వేదంలో అయితే దివ్య ఔషధంగా భావిస్తారు. అదే సమయంలో తేనె వినియోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది. లేకపోతే మొదటికే మోసం రావచ్చు. ఆ వివరాలు మీ కోసం.
Honey Precautions: ప్రకృతిలో విరివిగా లభించే పోషక పదార్ధాల్లో తేనె ఒకటి. ఇందులో ఉండే వివిధ రకాల విటమిన్లు, పో,కాలు, యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా చాలా రకాల వ్యాధులు తగ్గించడంలో దోహదపడుతుంది. అన్ని రకాల వైద్య విధానాల్లోనూ తేనె ప్రస్తావన ఉండటం విశేషం. కానీ తేనెను కొన్ని పదార్ధాలతో కలిపి తీసుకోవడం వల్ల విషంగా మారుతుందట.
ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగిన తేనె కొన్ని ప్రత్యేక సందర్బాల్లో విషంగా కూడా మారవచ్చు. అందుకే తేనెను ఎలా సేవిస్తున్నామనేది చాలా ముఖ్యం. ఏదైనా వస్తువుతో తేనెను కలిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే 5 రకాల పదార్ధాలతో తేనె కలిపి తీసుకోవడం వల్ల అది ప్రాణాంతక సమస్యకు దారి తీయవచ్చు. చాలామందికి తేనె మంచిదనే తెలుసు గానీ ఎలా సేవించాలనేది తెలియదు. ఇది పెను ముప్పుకు కారణం కావచ్చు.
తేనెను వేడి నీళ్లతో కలిపి తీసుకోవడం మంచిది కాదు. ఇలా చేస్తే పోషక విలువలు తగ్గిపోతాయి. వేడి నీళ్లలో ఉండే ఉష్ణోగ్రత కారణంగా తేనెలో ఉండే ఎంజైమ్స్, యాంటీ ఆక్సిడెంట్లు తొలగిపోవచ్చు. దాంతో ఆరోగ్యానికి ప్రయోజనం కంటే నష్టం కలగవచ్చు. ఇక రెండవది వాల్‌నట్స్‌తో కలిపి తీసుకోవడం. వాస్తవానికి తేనె వాల్‌నట్స్ మిశ్రమం రుచిగా ఉంటుంది. కానీ వాల్‌నట్స్‌లో ఫ్యాట్ అధికంగా ఉండి తేనెతో కలవడం వల్ల శరీరంలో కేలరీలు పెరిగిపోతాయి. స్థూలకాయానికి కారణం కావచ్చు.
ఇక మరో పద్ధతి తేనెతో అల్లం కలిపి తీసుకోవడం. సాధారణంగా జలుబు, దగ్గు తగ్గించేందుకు చాలా మంది ఈ రెండూ కలిపి సేవిస్తుంటారు. కానీ ఈ రెండూ కలపడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం పడవచ్చు. దీనివల్ల కడుపులో మంట, నొప్పి, అసౌకర్యం కలగవచ్చు. నాలుగవది చాలా చోట్ల చేసేదే. నిమ్మరసంలో తేనె కలిపి తీసుకోవడం. సాధారణంగా జీర్ణక్రియను మెరుగుపర్చేందుకు ఇలా తీసుకుంటారు. కానీ ఈ మిశ్రమం కొంతమందికి మంచిది కాదు. నిమ్మరసంలో ఉండే ఆమ్ల గుణాలు తేనెతో కలవడం వల్ల ఎసిడిటీ సమస్య ఉత్పన్నం కావచ్చు. కడుపులో మంటకు దారి తీయవచ్చు.
ఇక తేనె పాలు కలిపి తీసుకోవడం అనాదిగా వస్తున్న అలవాటు. కానీ ఈ కాంబినేషన్ ఆరోగ్యానికి మంచిది కాదు. ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉత్పన్నం కావచ్చు. తేనె, పాలు కలవడం వల్ల పాలలోని ప్రోటీన్ తత్వం మారిపోవచ్చు. దాంతో జీర్ణక్రియలో ఇబ్బంది కలుగుతుంది.
Also read: Mutton vs Chicken vs Fish: మటన్, చికెన్, చేపల్లో ఏది మంచిది, ఏది ప్రమాదకరం, కారణాలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.