ఆధునిక జీవిన శైలిలో మార్పుల కారణంగా ప్రస్తుతం రక్తపోటు సమస్య బారిన పడే సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. వయసు పైబడిన వారిలో ప్రతి అయిదుగురు వ్యక్తులలో ఒకరికి అధిక రక్తపోటు (Hypertension) సమస్య ఉంది. దీనినే High BP అని కూడా పిలుస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది 9.4 మిలియన్ల మంది అధిక రక్తపోటు సమస్య కారణంగా కన్నుమూస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రక్తపోటు ఆధారంగా గుండె పనితీరును వైద్యులు సులువుగా గుర్తిస్తారు. సాధారణంగా ఆరోగ్యవంతుడైన వారిలో రక్తపోటు 120/80 గా ఉంటుంది. ఇది ఒకవేళ 130/80కి మించితే హైపర్‌టెన్షన్ సమస్య బారిన పడ్డారని చెప్పవచ్చు. కొందరు నాకు బీపీ తెప్పించకు అని అంటుంటారు. కారణంగా బీపీ వచ్చిందంటే ఆలోచన తీసుకునే వేగం పెరుగుతుంది. కొన్నిసార్లు తొందరపాటులో తప్పిదాలు చేయవచ్చు. అదే సమయంలో రక్తపోటు(Blood Pressure) అధికం కావడంతో గుండె సంబంధిత సమస్యలు సైతం వస్తాయిని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. హైబీపీకి సంబంధించి ఉన్న కొన్ని అపోహలు, వాటి గురించి వాస్తవాలను ముంబైలోని కోహినూర్ ఆసుపత్రికి చెందిన న్యూరోసర్జన్ డాక్టర్ విశ్వనాథన్ అయ్యర్ వెల్లడించారు. ఆ వివరాలు మీకోసం.


Also Read: COVID-19: దేశంలో మరోసారి 4 వేల కరోనా మరణాలు, పాజిటివ్ కన్నా డిశ్ఛార్జ్ కేసులు అధికం


అపోహ 1) హైపర్‌టెన్షన్ లేదా అధిక రక్తపోటు అనేది సాధారణ లక్షణమే. దీనివల్ల సమస్య ఏం లేదని భావిస్తున్నారు


వాస్తవాలు – అధిక రక్తపోటు వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. హైబీపీ కారణంగా మూత్రపిండాలు, గుండె, రక్తనాళాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఈ కారణాలతో గుండెపోటు లాంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే హైపర్‌టెన్షన్ లేదా అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. కచ్చితంగా దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి.


అపోహ 2) హైపర్‌టెన్షన్ లేదా అధిక రక్తపోటును నియంత్రించడం సాధ్యం కాదు.


వాస్తవాలు – వాస్తవానికి హైపర్‌టెన్షన్‌(Hypertension)ను నిరోధించడం సాధ్యం కాదు. కానీ దీనిని నియంత్రించడానికి కొన్ని ప్రయత్నాలు చేయవచ్చు. మీ జీవనశైలిలో మార్పులు వస్తే హైబీపీకి కొంతమేర పరిష్కారం దొరుకుతుంది.


అపోహ 3) పురుషులలో మాత్రమే హైపర్ టెన్షన్ సమస్య వస్తుంది. మహిళలలో చాలా తక్కువగా హైబీపీ సమస్య తలెత్తుతుంది.


వాస్తవాలు – ఆధునిక జీవనశైలిలో మార్పులు, ఒత్తిడిని జయించే విధానాన్ని బట్టి పురుషులు, స్త్రీలు అనే తేడా లేకుండా అందరికీ హైపర్‌టెన్షన్ సమస్య వస్తుంది. అయితే మహిళలలో (Post-menopause) మోనోపాజ్ తరువాత అధిక రక్తపోటు బారిన పడే అవకాశాలు అధికంగా ఉంటాయి.


Also Read: Covid-19: ఫేస్ మాస్కులు సుదీర్ఘకాలం వాడితే శరీరంలో Oxygen తగ్గుతుందా, నిజమేంటంటే


అపోహ 4)  రక్తపోటు సమస్య వయసు పైబడిన తరువాత వృద్ధాప్యంలో వస్తుందని భావిస్తుంటారు.


వాస్తవాలు – హైపర్‌టెన్షన్ ఏ సమయంలోనైనా, ఏ వయసులోనైనా వారి ఆరోగ్య పరిస్థితి, జీవనశైలిని బట్టి హైబీపీ సమస్య వస్తుంది. ప్రస్తుతం టీనేజ్ దాటిన కొన్నేళ్లలోనే హైపర్‌టెన్షన్ సమస్య బారిన పడవచ్చు. అధిక రక్తపోటు సమస్య కారణంగా గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.


అపోహ 5) రక్తపోటు(BP) సమస్య వారసత్వంగా వస్తుంది


వాస్తవాలు – ఆరోగ్యకరమైన జీవనశైలి కొనసాగిస్తే హైబీపీ సమస్య బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆహారంలో తగిన మోతాదులో ఉప్పు తీసుకుంటూ, పండ్లు, తాజా కూరగాయలు తినడం, వ్యాయాయం చేయడంతో బీపీ సమస్య మీ దరి చేరదు. ఎన్ని ఆహార నియమాలు పాటించినా, జాగ్రత్తలు తీసుకున్నా తల్లిదండ్రులకు చిన్న వయసులో బీపీ సమస్య వస్తే, వారి సంతానం కూడా హైపర్‌టెన్షన్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి.


అపోహ 6) రక్తపోటు సమస్య తగ్గితే హైపర్‌టెన్షన్ మెడిసన్ వాడకం ఆపివేయవచ్చా.


వాస్తవాలు – ఈ విషయంలో బీపీ షేషెంట్లు డాక్టర్ల సలహాలు తీసుకోవాలి. ఒకవేళ అకస్మాత్తుగా హైబీపీ ట్యాబ్లెట్లు, బెడిసిన్ వాడకం మానివేయడం కారణంగా గుండె, మెదడు, మూత్రపిండాలు లాంటి అవయవాలు దెబ్బతినే అవకాశం ఉందని వైద్య నిపుణులు తెలిపారు. లక్షణాలు అంతగా కనిపించకపోయినా భవిష్యత్తులో సమస్యలు తలెత్తుతాయని డాక్టర్ విశ్వనాథన్ అయ్యర్ పేర్కొన్నారు.


Also Read: COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ కోసం CoWin యాప్‌లో ఇలా సులువుగా రిజిస్ట్రేషన్ చేసుకోండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook