Neem Benefits: ప్రకృతిలో లభించే బెస్ట్ యాంటీ బయోటిక్‌గా , అద్భుతమైన ఔషధ గుణాలున్న మొక్కగా వేపకు పేరుంది. వేప అనేది భారతీయలకు ప్రత్యేకం. వేపతో కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చాలా మందికి తెలియదు. అవేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వేపలో చాలా రకాల సమ్మేళనాలున్నాయి. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చాలా అధికం. రుచిలో చేదుగా ఉన్నా..ఆరోగ్యపరంగా చాలా మంచిది. వేప ఆకులతో అల్సర్లు, జీర్ణకోశ వ్యాధులు, మెదడు సంబంధిత సమస్యలు, చర్మవ్యాధులు, జుట్టు సమస్య, కాలేయం, మూత్రపిండాల సమస్య నివారణ సాధ్యమవుతుంది. మలేరియా తీవ్రత పెరగకుండా చేయడంలో వేప అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మలేరియాను నియంత్రిస్తాయి. ఇక కామెర్లు వ్యాధికి వేపను మించిన ఔషధం లేదనే చెప్పాలంటున్నారు వైద్య నిపుణులు. వేపరసంలో కొద్దిగా తేనె కలుపుకుని తాగితే..కామెర్ల నుంచి రక్షించుకోవచ్చు.


వేపరసం కొద్దిగా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఈ జ్యూస్ యాంటీ వైరల్‌లా పనిచేస్తుండటంతో..వైరల్ ఫీవర్లు తగ్గుతాయి. కార్డియో వాస్కులర్ సమస్యలు దూరమౌతాయి. వేపరసంతో మధుమేహం వ్యాధి రాకుండా నివారించవచ్చు. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను వేపరసం బ్యాలెన్స్ చేస్తుంది. అంతేకాకుండా..రోగ నిరోధక శక్తిని పెంచడంతో దోహదపడుతుంది. 


గర్భిణీ స్త్రీలు వేపనీరు తీసుకుంటే..యోనిలో నొప్పి సమస్యలు దూరమౌతాయి. డెలివరీ తరువాత కొన్నిరోజులపాటు వేప నీరు తాగడం అలవాటు చేసుకుంటే..చాలా రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి విముక్తి పొందవచ్చు. దంతాలు, చిగుళ్ల నుంచి రక్తం రావడాన్ని నిరోధిస్తుంది. దీనికోసం వేప బెరడు లేదా కొమ్మ లేదా ఆకుల్ని నీటిలో బాగా ఉడకబెట్టి.. ఆ నీటితో నోరు శుభ్రం చేసుకోవాలి. ముఖంపై ఏర్పడే మొటిమల్ని కూడాడ వేప రసం లేదా వేపాకు దూరం చేస్తుంది. 


Also read: Muskmelon Benefits: ఖర్బూజతో అద్భుత ప్రయోజనాలు, కేన్సర్ సైతం..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook