Diabetes New Medicine: మధుమేహ వ్యాధిగ్రస్థులకు గుడ్‌న్యుస్. డయాబెటిస్ నియంత్రణకు మరో ఔషధం అందుబాటులో వచ్చేసింది. ప్రముఖ కంపెనీ నోవోనార్డిస్క్ ఈ కొత్త మందును భారతీయ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో అతి సాధారణంగా, ఎక్కువశాతం మందిని పీడిస్తున్న సమస్య డయాబెటిస్. ఇప్పటికే మార్కెట్‌లో డయాబెటిస్ నియంత్రణకు చాలా రకాల మందులు అందుబాటులో ఉన్నా..ఇంకా అవసరం మాత్రం తీరడం లేదు. ఈ తరుణంలో డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు ప్రముఖ ఔషధ కంపెనీ నోవోనార్డిస్క్ గుడ్‌న్యూస్ అందించింది. డయాబెటిస్ నిర్మూలనలో అద్భుతంగా పనిచేస్తున్న సెమాగ్లూటైడ్ (Semaglutide Medicine) మందును ప్రపంచంలోనే తొలిసారిగా ఓరల్ ట్యాబ్లెట్ రూపంలో అందిస్తోంది. ఇప్పటి వరకూ ఈ మందు కేవలం ఇంజక్షన్ రూపంలోనే అందుబాటులో ఉంది. డయాబెటిస్ (Diabetes)వ్యాధిగ్రస్థుల్లో బ్లడ్ షుగర్ లెవల్‌ను అదుపులో ఉంచడం, బరువు తగ్గించడంలో ఈ ఔషధం అద్భుతంగా ‌పనిచేస్తుంది. 


ఇప్పటికే ఈ ఔషధంపై ఇండియా సహా పలు దేశాల్లో పది ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది నోవోనార్డిస్క్ (Novonordisk) కంపెనీ. ఈ ట్రయల్స్‌లో వేయికి పైగా భారతీయులే ఉన్నారని కంపెనీ ప్రకటించింది. యూఎస్ మార్కెట్‌లో ఈ మందుకు 2019లో ఆమోదం లభించగా..ఇండియాలో 2020 డిసెంబర్‌లో ఆమోదం లభించింది.సెమాగ్లూటైడ్ మందును ట్యాబ్లెట్ రూపంలో తీసుకొచ్చేందుకు నోవోనార్డిస్క్ సంస్థ 15 ఏళ్లపాటు విస్తృతమైన పరిశోధనలు చేసి..విజయం సాధించింది.


Also read: Seven Soups: బరువు తగ్గేందుకు ఏడు రకాల అద్భుతమైన సూప్‌లు ఇవే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.