Nutmeg Benefits: బిర్యానీలో వేసే జాజికాయతో బోలెడు లాభాలు.. ఈ వ్యాధులకి చెక్!
Nutmeg Benefits: జాజికాయను ఆహారాల్లో వినియోగించడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. దీంతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది. ఇవే కాకుండా ఇతర లాభాలు కూడా కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Nutmeg Benefits In Telugu: జాజికాయను భారతీయులు మసాలాగా వినియోగిస్తూ ఉంటారు. ఇందులో ఉండే పోషకాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. దీంతో పాటు ఈ జాజికాయల్లో మాంగనీస్, మాగ్నీషియం, ఐరన్, కాల్షియం లభిస్తాయి. జాజికాయను ఆహారాల్లో వినియోగించడం వల్ల ఎముఖలు దృఢంగా తయారవుతాయి. క్రమం తప్పకుండా దీనితో తయారు చేసిన పౌడర్‌ను పాలలో కలుపుకుని తాగడం వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. అంతేకాకుండా రక్తపోటు, మధుమేహం నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా బోలెడు లాభాలు కలుగుతాయని నిపుణులు అంటున్నారు. అయితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జాజికాయ తినడం వల్ల కలిగే లాభాలు:
జీర్ణక్రియ మెరుగుపడుతుంది:
జాజికాయలోని ఎంజైములు జీర్ణ ప్రక్రియను సులభతరం చేస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు గ్యాస్ట్రిక్, అజీర్ణంతో పాటు వికారం వంటి జీర్ణ సమస్యలను తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి. దీంతో పాటు అనే పొట్ట సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
నొప్పి నివారణ:
జాజికాయలో యాంటీ-ఇన్ఫ్లమేటరీ మూలకాలు నొప్పులను నివారించేందుకు ఎంతగానో సహాయపడతాయి. దీంతో పాటు వీటిని ఆహారాల్లో వినియోగించడం వల్ల కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులతో పాటు తలనొప్పి వంటి నొప్పిని తగ్గుతాయి.
మెదడు పనితీరు:
జాజికాయలోని కొన్ని సమ్మేళనాలు మెదడు పనితీరును మెరుగుపరచడానికి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచడానికి సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ జాజికాయ పొడిని పాలలో కలుపుకుని తాగడం వల్ల మానసిక సమస్యలు కూడా దూరమవుతాయి.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
నిద్రను మెరుగుపరుస్తుంది:
జాజికాయలో రిలాక్సింగ్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి నిద్రను ప్రేరేపించడానికి, నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి సహాయపడతాయి. తరచుగా నిద్రలేమి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు జాజికాయలను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
జాజికాయ యాంటీఆక్సిడెంట్లలో సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, అంటువ్యాధులను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. చర్మం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి