Papaya Benefits: బొప్పాయి పండుకి చాలా ప్రత్యేకతలున్నాయి. బొప్పాయితో ప్రయోజనాలు అద్భుతంగా ఉండటమే కాకుండా ఏడాది పొడుగునా దొరికే అన్‌సీజనల్ ఫ్రూట్ ఇది. బొప్పాయితో కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సంవత్సరం పొడుగునా లభించే కొన్ని అరుదైన పండ్లో ఒకటి బొప్పాయి. బొప్పాయితో ఆరోగ్యపరమైన ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అందుకే వైద్యులు తప్పకుండా బొప్పాయి తినమని సూచిస్తుంటారు. బొప్పాయితో కలిగే ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. అటు బొప్పాయిని సహజంగా అందరూ ఇష్టపడతారు కూడా. రుచికరంగా ఉండటమే కాకుండా పోషక పదార్ధాల్ని సమృద్ధిగా కలిగి ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంత ప్రయోజనకరమంటే..చాలామంది బొప్పాయిని బ్రేక్‌ఫాస్ట్ రూపంలో కూడా తీసుకుంటారు. ఇంకొంతమంది స్నాక్స్ రూపంలో మరి కొంతమంది డైట్‌లో భాగంగా చేసుకోవడం చూస్తుంటాం. బొప్పాయి క్రమం తప్పకుండా తీసుకుంటే జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. మీ చర్మం కాంతివంతమౌతుంది. అంతేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యలు దూరమౌతాయి. 


కొలెస్ట్రాల్ నియంత్రణ


బొప్పాయిలో ఫైబర్ అత్యధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉపయోగపడుతుంది. ఇది కాకుండా ప్రతిరోజూ మీరు డైట్‌లో బొప్పాయిని భాగంగా చేసుకుంటే బరువు తగ్గేందుకు కూడా దోహదపడుతుంది. బొప్పాయిని ఉప్పుతో కూడా తీసుకోవచ్చు.


రోగ నిరోధక శక్తి పెంపు


బొప్పాయి రోజు తీసుకుంటే శరీరం మెటబోలిజం ప్రక్రియ మెరుగుపడుతుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఈ రెండు విటమిన్లు ఆరోగ్యానికి చాలా మంచివి. విటమిన్ ఎ కంటికి మంచిదైతే..విటమిన్ సి అనేది రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. 


చర్మాన్ని కాంతివంతం చేసేదిగా


బొప్పాయి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మంపై కూడా ప్రభావం కన్పిస్తుంది. మీ చర్మం కాంతివంతంగా మారుతుంది. బొప్పాయి చర్మంపై యాంటీ ఏజీయింగ్‌లా పనిచేస్తుంది. దీంతో పాటు బొప్పాయి ఆకుల్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల్ని తగ్గించేందుకు ఉపయోగిస్తారు. డెంగ్యూ బారిన పడినప్పుడు సహజంగానే ప్లేట్‌లెట్స్ తగ్గిపోతాయి. బొప్పాయి ఆకుల రసం నిజంగానే సంజీవనిలా ఉపయోగపడుతుంది. 


కడుపును క్లీన్ చేస్తుంది


ఉదయం బ్రేక్‌ఫాస్ట్ సమయంలో బొప్పాయి తీసుకుంటే మీ కడుపు శుభ్రంగా ఉంటుంది. బొప్పాయి కడుపుకు చాలా మంచిది. బొప్పాయి పండ్లు ఒంటికి చలవ కూడా చేస్తాయి. వేసవిలో మీ కడుపు శుభ్రంగా లేదని అనుకుంటే..బొప్పాయి తినడం ప్రారంభిస్తే కొన్నిరోజుల్లోనే క్లీన్ అవుతుంది. అన్ని సమస్యలు దూరమౌతాయి.


Also read: Covid 19 Strange Symptoms: కరోనా వైరస్ కొత్త, స్ట్రేంజ్ లక్షణాలు ఏంటో తెలుసా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook