Papaya Seed For Diabetes And Weight Loss: బొప్పాయి పండు చాలా సాధారణమైన పండు. ఇది అన్ని కాలాల్లో చాలా తక్కువ ఖర్చుతో లభిస్తుంది. దీనిని అందరూ ఆహారంలో భాగంగా  తినొచ్చు. అయితే పండును కోసిన తర్వాత దానిలో గింజలు పనికిరావని.. బయటపడేస్తూ ఉంటారు.  అయితే ఇకనుంచి అలా చేయకండి. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి ఇది శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బొప్పాయి గింజల ప్రయోజనాలు:


ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం కలిగిస్తుంది:
బొప్పాయి పండు గింజల్లో శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు పరిమాణాలు అధిక మొత్తంలో ఉంటాయి. కాబట్టి వీటిని సమంత తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. కాబట్టి తరచుగా దగ్గు జలుబు వంటి సమస్యలతో బాధపడేవారు ఈ గింజలను తీసుకోవాలి.


కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గిస్తాయి:
బొప్పాయి గింజల్లో కొవ్వు ఆమ్లాలు అధిక పరిమాణంలో ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా రక్తపోటున నివారించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. గుండెపోటు రాకుండా సహాయపడుతుంది.


బరువును తగ్గిస్తుంది:
బొప్పాయి పండు గింజ లు ఫైబర్ పరిమాణాలు అధికంగా ఉండడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరిచి.. ఊబకాయం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా పెరుగుతున్న బరువును కూడా సులభంగా తగ్గించడానికి దోహదపడుతుంది.


బొప్పాయి గింజల్ని ఎలా తినాలి..?
అందరికీ బొప్పాయి గింజల్ని ఎలా తినాలని ప్రశ్న మదిలో రేకెత్తవచ్చు. అయితే ఈ విత్తనాలు నీటిలో శుభ్రం చేసుకొని.. ఎండలో 15 రోజులపాటు ఎండబెట్టాలి. ఆ తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని.. ఏదైనా ఆహార పదార్థాలను తినే క్రమంలో దాని పైనుంచి ఈ పొడిని చల్లి తినొచ్చు.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Also Read: Dussehra 2022: దసరా రోజు ఆయుధ పూజలో భాగంగా ఇలా చేయండి.. మీరు కోరిన కోరికలు తీరుతాయి..


Also Read: Dussehra 2022: శ్రీ రాజరాజేశ్వరిదేవిగా అమ్మవారు.. దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook