Eggs Benefits: ఈ వయసు వారు కచ్చితంగా గుడ్డు తినాలి.. ఉపయోగాలు ఇవే
Egg For 40 Plus Age Group: కోడిగుడ్డు ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనలో చాలామందికి ప్రతి రోజూ గుడ్డు తినే అలవాటు ఉంటుంది. అయితే 40 ఏళ్ల వయసు దాటిన వారు మాత్రం కచ్చితంగా తమ డైట్‌లో గుడ్డు చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Egg For 40 Plus Age Group: కోడిగుడ్డుకు సూపర్ ఫుడ్ హోదా ఉంది. మన శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూర్చే అనేక పోషకాలు ఇందులో ఉన్నాయి. చాలా మంది దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్‌తో తినడానికి ఇష్టపడతారు. జిమ్‌లో గంటల తరబడి చెమటలు పట్టే వారు కచ్చితంగా గుడ్డులోని తెల్లసొన తింటారు. గుడ్లు అన్ని వయసుల వారికి ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, నిర్దిష్ట వయస్సు గల వ్యక్తులు ఈ సూపర్‌ఫుడ్‌ను తప్పనిసరిగా తినాలి. ఇది వారి శరీరానికి చాలా బలాన్ని ఇస్తుంది.
40 ఏళ్లు దాటిన వారు..
40 ఏళ్లు దాటిన వారు కచ్చితంగా గుడ్డు తినాలి. వయస్సు పెరిగేకొద్దీ.. మధ్య వయస్సుకు చేరుకున్నప్పుడు సాధారణంగా ఎముకలు బలహీనపడటం ప్రారంభమవుతుంది. కండరాల నొప్పి తరచుగా సంభవిస్తుంది. ఈ తరుణంలో గుడ్లు తింటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గుడ్డు తీసుకోవడం ద్వారా ప్రోటీన్ సమృద్ధిగా అందుతుంది. అలాగే విటమిన్, కాల్షియం కూడా శరీరానికి లభిస్తాయి.
గుడ్డులో ఉండే పోషకాలు
ఉడకబెట్టిన గుడ్డు తింటే శరీరానికి 6.3 గ్రాముల ప్రొటీన్లు, 77 కేలరీలు, 212 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్, 0.6 గ్రాముల పిండి పదార్థాలు, 5.3 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వులు, అలాగే విటమిన్-ఎ, విటమిన్-బి2, విటమిన్-బి5, ఫాస్పరస్, సెలీనియం కూడా అందుబాటులో ఉంటాయి. అందుకే చాలామంది గుడ్లు తినేందుకు చాలా ఇష్టపడతారు.
ప్రొటీన్లు, విటమిన్లు, కాల్షియం తీసుకుంటే శరీరం పూర్తి బలంగా తయారవుతుంది. బలహీనత మాయం అవుతుంది. అందుకే 40 ఏళ్ల వయసులో వారు రెగ్యులర్ డైట్‌లో గుడ్లను తప్పనిసరిగా చేర్చుకోవాలి.
రోజుకు ఎన్ని గుడ్లు అవసరం..?
40 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు వారానికి కనీసం 7 గుడ్లు తినాలని గ్రేటర్ నోయిడాలోని GIMS హాస్పిటల్‌లో పనిచేస్తున్న ప్రముఖ డైటీషియన్ డాక్టర్ ఆయుషి యాదవ్ తెలిపారు. రోజుకు ఒక గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిదదన్నారు. ఉడికించిన గుడ్లు మాత్రమే తినడానికి ప్రయత్నించాలని.. ఇది ఆరోగ్యకరమైన మార్గమని ఆయన చెప్పారు.
(గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: PM Kisan Yojana: పీఎం కిసాన్ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే ఖాతాల్లోకి నగదు జమ
Also Read: Virat Kohli: లిటన్ దాస్ స్టన్నింగ్ క్యాచ్.. ఆశ్చర్యపోయిన విరాట్ కోహ్లీ.. వీడియో చూడండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి