PM Kisan Yojana: పీఎం కిసాన్ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే ఖాతాల్లోకి నగదు జమ

Pm Kisan Samman Nidhi: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్ స్కీమ్) ప్రయోజనాన్ని పొందుతున్న కోట్లాది మంది రైతులకు శుభవార్త. పీఎం కిసాన్ 13వ విడత నిధులను త్వరలోనే రిలీజ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది.
 

  • Dec 04, 2022, 16:25 PM IST
1 /5

పీఎం కిసాన్ యోజన 13వ విడత నగదును డిసెంబర్ 2022 నుంచి మార్చి 2023 వరకు కేంద్రం బదిలీ చేయనుంది. ఈ ఏడాది అక్టోబర్ 17న ప్రభుత్వం 12వ విడత సొమ్మును కోట్లాది మంది రైతుల ఖాతాల్లోకి జమ చేసింది.   

2 /5

పీఎం కిసాన్ యోజనకు సంబంధించి అనేక రకాల మోసాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఈ పథకం పొందాలంటే కచ్చితంగా రేషన్ కార్డ్ నంబర్‌ను సమర్పించాలని స్పష్టం చేసింది. మీ రేషన్ కార్డు నంబర్‌ను సమర్పించకపోతే మీకు రూ.2 వేలు అందదు.   

3 /5

ప్రభుత్వం ఈ-కేవైసీ, భూమి రికార్డు ధృవీకరణ, రేషన్ కార్డ్ నంబర్‌ను సమర్పించడం తప్పనిసరి చేసింది. సాఫ్ట్ కాపీలు అందజేస్తే సరిపోతుంది.   

4 /5

ప్రభుత్వోద్యోగి లేదా పదవీ విరమణ పొందిన వారు ప్రస్తుత లేదా మాజీ ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి అయినా కూడా ఈ పథకానికి అనర్హులే. ప్రొఫెషనల్ రిజిస్టర్డ్ డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు లేదా వారి కుటుంబ సభ్యులు అనర్హుల జాబితాలోకి వస్తారు. ఆదాయపు పన్ను చెల్లించే కుటుంబాలకు కూడా ఈ పథకం ప్రయోజనం ఉండదు.

5 /5

ఈ పథకంలో రైతులకు ఏటా 6 వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. ఇప్పటివరకు 12 విడతల సొమ్మును ప్రభుత్వం రైతుల ఖాతాలోకి జమ చేయగా.. త్వరలో 13వ విడత సొమ్ము కూడా ఖాతాలోకి రాబోతోంది.