Disadvantages Of Tomatoes: టమాటో చూడడానికి ఎర్రని రంగులో చక్కని పులుపును కలిగి వుంటుంది. అంతే కాకుండా ఆహారానికి మంచి రుచిని చేకూర్చుతుంది. దీనిని కూరల్లో ఉపయోగించడమే కాకుండా సలాడ్స్‌, సాసుల్లో ఉపయోగిస్తారు. టమోటాలు అన్ని సీజన్లలో సులభంగా లభిస్తాయి. ఆరోగ్యానికి అవసరమైన క్యాల్షియం, విటమిన్ సి మొదలైన పోషకాలు అందుతాయి. ఇది వ్యాధులతో పోరాడటానికి శరీరాన్ని ధృడంగా ఉంచుతుంది. అంతే కాకుండా కళ్ళకు మంచి ప్రయోజనాన్ని ఇస్తుందని  ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే టమాటోలను మాత్రం తగిన మోతాదులో తినాలని చెబుతున్నారు. టామోటలను అతిగా తింటే శరీరాని నష్టాలు రావోచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టమోట వల్ల వచ్చే సమస్యల గురించి తెలుసుకుందాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సమస్యలు ఉన్నవారు టమాటోను తినకూడదు:


కిడ్నీ స్టోన్ సమస్య:


కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు టమోటాలను అస్సలు తినోద్దని వైద్యనిపుణులు చెబుతున్నారు. అయితే టమాటాలను ఎక్కువగా తీననడం చేత కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు. టమాటోలో కాల్షియం ఆక్సైడ్ అధికంగా ఉంటాయి. ఇది మూత్రపిండాల్లో సమస్యలను పెంచుతుంది. కాల్షియం ఆక్సైడ్ వల్ల 90% మందికి కిడ్నీలో రాళ్ల సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కిడ్నీలో రాళ్లు ఉన్న వారు టమాటో తీనడం పూర్తిగా మానేయాలి.



కీళ్ళ నొప్పి:


ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా అందరిలో కీళ్ళ నొప్పులు సమస్యలుగా మారాయి.  కీళ్లలో నొప్పి లాంటి సమస్యలు ఉంటే టమోటాలు తీసుకోవడం హానికరమని వైద్యులు చెబుతున్నారు. ఇది కీళ్లలో సమస్యలను మరింత పెంచడమే కాకుండా  కీళ్లలో వాపు, నొప్పులు కూడా వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.



అతిసారం:


విరేచనాల సమస్యలు ఉంటే టమోటాలు తీనకపోవడమే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టొమాటోలో సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుందని ఇది తినడం ద్వారా డయేరియా సమస్య మరింత పెరుగుతుందని వైద్యులు తెలుపుతున్నారు.



జీర్ణవ్యవస్థ:


టమోటాలు కొన్నిసార్లు జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను కూడా తెచ్చిపెడుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. టమాటాలు ఎక్కువగా తింటే ఎసిడిటీ సమస్య రావచ్చని తెలిపారు. దీని కారణంగా గుండెల్లో మంట వచ్చే అవకాశం అధికంగా ఉంటుందని, నిత్యం గ్యాస్‌ సమస్యతో బాధపడే వారు టమాటా తీసుకోవడం మానేయాలని వైద్యులు సూచిస్తున్నారు.


(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Also Read: Cashier Theft Bank Cash: బెట్టింగ్ లో వస్తే వస్తా.. లేదంటే చస్తా! క్యాషియర్ బ్యాంక్ నగదు చోరీ కేసులో క్యాషియర్ ట్విస్ట్..


Also Read: Samantha Hot Selfie: హాట్ హాట్‌గా సమంత.. ఒంటిపై కేవలం బాత్ టవల్‌తో సెల్ఫీ పోజు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook