Pink Guava: డయాబెటిస్ పేషంట్లు ఈ పండు తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటుంది.!
Pink Guava Benefits: జామకాయలు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జామకాయలు తీసుకోవడం వల్ల జీర్ణా వ్యవస్థ మెరుగుపడుతుందని మన అందరికి తెలిసిందే.. అయితే మీరు పింక్ జామ కాయ తిన్నారా..? దీని వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Pink Guava Benefits: జామకాయలను చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. దీని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జామ కాయలల్లో చాలా రకాలు ఉంటాయి. మార్కెట్‌లో తెల్ల రంగు పండ్లు కనిపిస్తాయి. కానీ పింక్ జామ కాయ కూడా ఒకటి ఉంది. ఈ జామకాయ చూడానికి మామూలు జామలా ఉన్న దీని లోపల పింక్ రంగు ఉంటుంది. ఈ పండు తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
✥ పింక్ రంగు జామకాయలో విటమిన్ సి, ఎ, బి1, బి2, బి3, పొటాషియం, ఫైబర్ పోషకాలు లాభిస్తాయి.
✥ తెల్ల జామ కంటే పింక్ రంగు జామకాయలో 20 % ఫైబర్ కంటెంట్ దొరుకుతుంది.
✥ పింక్ జామకాయ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
✥ అంతేకాకుండా పింక్ జామకాయలో విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది. దీని వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.
✥ పింక్ జామకాయల్లో బీటా కెరోటీన్, లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు వంటి గుణాలు ఉంటాయి.
✥ పింక్ జామకాయలను తీసుకోవడం వల్ల శరీర బరువు సమస్య నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.
Also read: Hing Water to lose weight: ఇంగువ వాటర్‌తో 9 రోజుల్లో బరువు తగ్గడం ఎలాగో ఇప్పుడే తెలుసుకోండి..
✥ ఈ పింక్ జామకాయ తీసుకోవడం వల్ల రక్తపోటును తగ్గించుకోవచ్చు.
✥ షుగర్‌తో బాధపడుతున్నవారు ఈ పింక్ జామకాయ తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
✥ గర్భిణీ స్త్రీలు పింక్ జామకాయ తీసుకోవడం వల్ల గర్భస్త శిశువు ఆరోగ్యంగా ఉంటుంది.
✥ మెదడు ఆరోగ్యం ఉంచడంలో పింక్ జామకాయం సహాయపడుతుంది. ఇందులోని విటమిన్ బి3, బి6 మెదడుకు రక్తప్రసరణను పెంచి మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి.
ఈ విధంగా పింక్ జామకాయలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
Also read: Sleeping Positions: బోర్లాలో పడుకుంటున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter