Sleeping Positions: బోర్లాలో పడుకుంటున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి!

Falling Asleep On Stomach: మనలో చాలా మంది సాధారణంగా నిద్రపోయే సమయంలో వారి కంఫర్టబుల్ పొజిషన్లో పడుకుంటారు. కొంతమంది ఎడ‌మ చేతి వైపున పడుకుంటారు కుడి చేతి వైపున పడుకుంటారు. మరి కొంతమంది బోర్లా పడుకుంటారు. అయితే కొన్నిసార్లు ఈ పొజిషన్లో పడుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా బోర్ లో పడుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు. అయితే బోర్‌లో పడుకోవడం వల్ల వచ్చే లాభాలు ఎంటో మనం తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 28, 2023, 12:06 PM IST
Sleeping Positions: బోర్లాలో పడుకుంటున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి!

Falling Asleep On Stomach: కొంతమంది నిద్రపోయే సమయంలో  గురక పెడుతుంటారు.  ఈ సమస్య కారణంగా నిద్రపోలేకపోతారు. అయితే ఇలా చేయడం వల్ల  ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. బోర్లా పడుకోవడం వల్ల గురక సమస్య పోతుందని నిపుణులు చెబుతున్నారు.  అసులు గురక సమస్య ఎలా వస్తుంది అంటే..?  వెల్లకిలా పడుకోవడం కారణంగా గురక సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

వెల్లకిలా పడుకోవడం వల్ల కొండనాలుక వెనుకకి వెళ్తుంది. దీని కారణంగా శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. గురక శబ్దం ఎక్కువగా వస్తుంది. బోర్లా పడుకోవడం కారణంగా కొండనాలుక నిలకడగా ఉంటుంది. శ్వాస కూడా సక్రమంగా జరుగుతుంది. గురక రాకుండా ఉంటుంది. అయితే పొట్ట ఎక్కువగా ఉన్నవారు ఛాతి వద్ద దిండు పెట్టుకుని చేతులను ప‌క్క‌కు చాచి పడుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

బోర్లా పడుకోవడం వల్ల నడుము నొప్పి, డిస్క్‌ సమస్యలతో బాధపడుతున్నవారు ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

 వెన్ను నొప్పితో బాధ‌ప‌డే వారు బోర్లా పడుకోవడం మేలు చేస్తుంది. దీని కోసం మ‌డిచిన కాళ్ల కింద దిండు పెట్టుకొని పడుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు.

బోర్లా ప‌డుకోవ‌డం వ‌ల్ల మెడ నొప్పితో బాధ‌ప‌డే వారి సమస్య తగ్గుతుంది. దీని కారణంగా  కండ‌రాల మీద ఒత్తిడి త‌గ్గి మెడ నొప్పులు త‌గ్గుతాయి. 

Also Read: Kalonji Seeds: ఈ విత్త‌నాలు ప్రతిరోజు తీసుకోవడం వల్ల ..షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంటుంది

 బోర్లా ప‌డుకోవడం వల్ల సయాటికా నొప్పులతో బాధపడుతున్న వారికి మేలు జరుగుతుంది. దీనికోసం ఒక కాళ్ల ని చాచి, మ‌రోకాళ్లని మ‌డవ‌డంతో  వ‌ల్ల నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం పొందవచ్చు. 

 కొంతమంది నిద్రలో చేతులకు తిమ్మిర్లు వస్తు ఉంటాయి. బోర్లా పడుకోవడం వల్ల ఈ తిమ్మర్ల సమస్య తగ్గతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

ఇలా బోర్లా ప‌డుకోవ‌డం వ‌ల్ల  వివిధ సమస్యల నుంచి ఉప‌శ‌మ‌నం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read: Asthma Diet Care: ఆస్తమాతో బాధపడుతున్నారా …శీతాకాలంలో తప్పకుండా తినాల్సిన ఫుడ్స్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News