Pomegranates For Weight Loss: దానిమ్మ గింజల్లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో శరీరానికి కావాల్సిన ఐరన్‌ అధిక పరిమాణంలో లభిస్తుంది. ఈ గింజల్లో అనేక రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి రక్తహీనతతో పాటు ఎముకల సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అయితే చాలా మంది ఈ దానిమ్మ గింజలకు బదులుగా దాని నుంచి తీసిన రసాన్ని ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇలా తాగడం వల్ల శరీరానికి రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇందులో ఉండే పోషకాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించి శరీర బరువు కూడా సులభంగా నియంత్రిస్తాయి. అంతేకాకుండా ఇందులో  యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, ఫ్లేవనాయిడ్లు బోలెడు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఈ దానిమ్మ గింజల నుంచి తీసిన రసాన్ని తాగడం వల్ల కొలెస్ట్రాల్‌ కూడా నియంత్రణలో ఉంటుంది. 
 
దానిమ్మ రసం తాగడం వల్ల ఎలా బరువు తగ్గుతారో తెలుసా?:
దానిమ్మ ఆకలిని నియంత్రిస్తుంది:

దానిమ్మలో 50 శాతం కంటే ఎక్కువ నీరు లభిస్తుంది. దీని కారణంగా ప్రతి రోజు దానిమ్మ నుంచి తీసిన జ్యూస్‌ను తాగడం వల్ల శరీరం హైడ్రేట్‌గా తయారవుతుంది. అంతేకాకుండా ఆకలి కూడా నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి భోజనం తర్వాత తప్పకుండా రోజులో ఒక్కసారైనా దానిమ్మ జ్యూస్‌ని తాగాల్సి ఉంటుంది. 


జీవక్రియను పెంచుతుంది:
దానిమ్మపండులో యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, కంజుగేటెడ్ లినోలెనిక్ యాసిడ్‌లు బోలెడు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు దానిమ్మతో తయారు చేసిన జ్యూస్‌ను తాగడం వల్ల జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం లభించి శరీరంలో మెండి కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది. 


Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  


ఎనర్జీ బూస్టర్ కోసం దానిమ్మ జ్యూస్‌:
దానిమ్మపండులో తగినంత మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. కాబట్టి దానిమ్మరసం తాగడం వల్ల శరీరానికి శక్తి లభించడమే కాకుండా ఏదైనా పని చేసే క్రమంలో అలసిపోకుండా చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వ్యాయామాలు రోజు చేసేవారు ఈ రసాన్ని ప్రతి రోజు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.


బరువు తగ్గడానికి దానిమ్మను ఎలా తీసుకోవాలి:
పెరుగుతున్న బరువును నియంత్రించుకోవాలనుకునేవారు ప్రతి రోజు దానిమ్మ పండ్లను అల్పాహారంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా పడుకునే క్రమంలో రాత్రిపూట దీని నుంచి తీసిన రసాన్ని తాగడం వల్ల శరీర యాక్టివ్‌గా ఉంటుంది. 


Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook