COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Raw Papaya Benefits: బొప్పాయిలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు పండిన బొప్పాయిని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా పైల్స్‌ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు తీసుకుంటే వారికి ఈ పండు దివ్యౌషధంగా పని చేస్తుంది. అయితే పండు కంటే పచ్చి బొప్పాయిని తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. పచ్చి బొప్పాయిని ఉడికించి లేదా సలాడ్‌లో కలిపి తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. అయితే బొప్పాయిని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
అనారోగ్యకరమైన ఆహారాలు రోజు తినడం వల్ల చాలా మందిలో జీర్ణక్రియ సమస్యలు వస్తున్నాయి. జీర్ణక్రియ దెబ్బతినడం కారణంగా అజీర్ణం, పొట్ట నొప్పులు, మలబద్ధకం, పొట్టలో వాపు వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి ప్రతి రోజు ఖాళీ కడుపుతో బొప్పాయిని తీసుకోవాలనియ ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అసిడిటీ, ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. 


Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ  


బరువు కూడా తగ్గొచ్చు:
బరువు తగ్గాలనుకునేవారికి కూడా పచ్చి బొప్పాయి చాలా మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో కేలరీల కంటెంట్‌ చాలా తక్కువగా ఉంటుది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు పచ్చి బొప్పాయిని తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా శరీరంలోని కొలెస్ట్రాల్‌ను కరిగించి బరువును కడా నియంత్రిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు పొట్టలోని ప్రేగుల కదిలికలు కూడా మెరుగుపడతాయి. 


కళ్లకు మేలు చేస్తుంది:
పచ్చి బొప్పాయి తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్ ఎ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల పోషకాల లోపం నుంచి ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు బాడీకి కెరోటినాయిడ్లు కూడా తగినంత పరిమాణంలో లభిస్తాయి. దీని కారణంగా కంటి చూపు మెరుగుపడుతుంది.


Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook