Red Aloe Vera Juice For Blood Pressure: కలబంద చర్మానికే కాకుండా శరీరానికి కూడా చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. చాలా మంది తరచుగా చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి ఆకు పచ్చ రంగులో ఉన్న కలబందను వినియోగిస్తూ ఉంటారు. అయితే కలబందలో ఎర్ర రంగు కలిగినవి కూడా ఉంటాయి. వీటిని అనారోగ్య సమస్యలకు వినియోగిస్తారు. ఇది రక్త పోటు సమస్యలను, చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు సహాయపడుతుంది. ఎరుపు రంగు కలబందలో పాలీశాకరైడ్లు, అమైనో ఆమ్లాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో పోషకాలు కూడా ఉంటాయి. కాబట్టి దీనిని చర్మానికి వినియోగిస్తే మొటిమల సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ దీని నుంచి తీసిన జ్యూస్‌ తాగడం వల్ల కూడా ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎరుపు కలబందలో ఉండే అద్భుతమైన ప్రయోజనాలు:
ఎరుపు రంగు కలబంద రక్తపోటు సమస్యలతో బాధపడేవారికి ప్రభావవంతంగా ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఎర్ర కలబంద రసాన్ని తాగితే రక్తపోటు అదుపులో ఉంటుంది. ఈ రసంలో ఉండే గుణాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే ఆధునిక జీవనశైలిని అనుసరించడం వల్ల చాలా మంది మహిళల్లో పీరియడ్స్ ఆలస్యంగా లేదా సమయానికి రావడం లేదు ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తాగితే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా పీరియడ్స్‌ సమయంలో వచ్చే నొప్పులు నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.


ఈ చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది:
వేసవి కాలంలో ముఖంపై మొటిమల సమస్యలు రావడం సర్వసాధరణం. దీని కారణంగా ముఖం అందహీనంగా తయారవుతుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఎర్ర కలబంద ఫేస్ ప్యాక్‌ను వినియోగించాలని నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఫేస్ ప్యాక్‌ అప్లై చేయడం వల్ల  ముఖానికి చల్లదనం రావడంతో పాటు మొటిమల సమస్య కూడా దూరమవుతుంది. జిడ్డు చర్మంపై దుమ్ము, ధూళి అంటుకోవడం వల్ల మొటిమలు, మొటిమలు ఎక్కువగా వస్తాయి. మొటిమల కారణంగా తీవ్ర చర్మ సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా ప్రతి రోజూ ఎర్ర కలబంద ఫేస్ ప్యాక్‌ వినియోగించాల్సి ఉంటుంది.


ఇది కూడా చదవండి : Ponguleti Srinivas Reddy: ఢిల్లీకి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. కీలక ప్రకటన రానుందా ?


ఇది కూడా చదవండి : Bandi Sanjay: సంతకాల్లేకుండా ప్రధానికి లేఖలు.. అసలు విషయం బయటపెట్టిన బండి సంజయ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook