Tips To Reduce Bad Cholesterol In Summer: శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా ఇప్పటికీ చాలామంది మరణించారు. ఎందుకంటే చెడు కొవ్వు కారణంగా చాలామందిలో గుండెపోటుతో పాటు మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. అంతేకాకుండా కొంతమంది శరీర బరువు పెరిగి ఉన్నట్టుండి అనేక ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా బాడీలో పెరుగుతున్న బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అయితే ప్రస్తుతం చాలామంది కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేక విఫలమవుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా సీజన్ ను బట్టి జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆహార పద్ధతుల్లో కూడా కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి అనుకూలమైన సీజన్లలో వేసవికాలం ఒకటి. ఈ సమయంలో ఉష్ణోగ్రత తీవ్రత పెరుగుతూ ఉంటుంది. కాబట్టి శరీరంలో నీటి శాతం కూడా తగ్గుతుంది. దీని కారణంగా ఎప్పటికప్పుడు శరీర పనితీరు కూడా మారుతుంది. కాబట్టి ఇలాంటి సమయాల్లోని ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ క్రింది చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.


వేసవి కాలంలో సులభంగా కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి చిట్కాలు:
ఇలాంటి ఆహారాలు మాత్రమే తీసుకోండి:
పండ్లు, కూరగాయలు:

వేసవిలో దోసకాయ, బీరకాయ, పొట్లకాయ, టమాటా, క్యాప్సికం వంటి  కూరగాయలు చాలా మంచివి. వీటిలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా లభిస్తాయి. కాబట్టి ఆహారాల్లో తప్పకుండా వీటిని చేసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు సహాయపడతాయి.


ధాన్యాలు:
శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గడానికి సమ్మర్లో తృణధాన్యాలు కూడా ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి ఆహారంలో ప్రతిరోజు ఓట్స్, బ్రౌన్ రైస్, రాగులు, క్వినోవా వంటి ధాన్యాలను తీసుకోవడం చాలా మంచిది. వీటిలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల కొలెస్ట్రాల్ ను తగ్గించడమే కాకుండా శరీర బరువును కూడా నియంత్రిస్తుంది.


వ్యాయామం:
ఎండాకాలంలో సులభంగా కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి వ్యాయామం కూడా ఎంతగానో సహాయపడుతుంది కాబట్టి కొలెస్ట్రాల్‌తో పాటు బరువును తగ్గించుకోవాలనుకునేవారు ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు తప్పకుండా వ్యాయామం చేయడం మంచిది. అలాగే ఈ సమయంలో సైక్లింగ్, స్విమ్మింగ్, వాకింగ్ చేయడం కూడా చాలా మంచిది.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


ధూమపానం, ఒత్తిడి:
వేసవి కాలంలో తొందరగా కొవ్వును తగ్గించుకోవాలనుకునేవారు ధూమపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండటం ఎంతో మంచిది. ధూమపానం చేయడం వల్ల గుండె సమస్యలు రావడమే కాకుండా శరీరంలోని కొవ్వు కూడా విచ్చలవిడిగా పెరుగుతుంది కాబట్టి ఎండాకాలంలో ధూమపానాన్ని మానుకోవడం ఎంతో మంచిది. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలనుకునేవారు ఒత్తిడికి కూడా లోనవ్వకుండా ఉండాల్సి ఉంటుంది.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి