COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Reduce High Cholesterol: శరీరంలోని దాగివున్న చెడు కొలెస్ట్రాల్ సైలెంట్ కిల్లర్ తో సమానం.. ఇది ఎప్పుడైనా ప్రాణాంతకంగా మారవచ్చు. ఆధునిక జీవనశైలి పాటించే వారిలో కొలెస్ట్రాల్ పెరగడం సాధారణ సమస్యగా మారింది. చెడు కొలెస్ట్రాల్ మీద అవగాహన లేకపోవడం వల్ల ప్రస్తుతం చాలామంది అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిన్న వయసులోని గుండెపోటు బారిన పడి మరణిస్తున్నారు. కాబట్టి మీ శరీరంలో వస్తున్న లక్షణాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలను పరిశీలించుకోవడం చాలా మేలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 


శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణం పెరగడం కారణంగా చాలామంది బరువు కూడా పెరుగుతున్నారు. మరికొంతమందిలో రక్తపోటు సమస్యలు పెరిగి గుండె కూడా దెబ్బతింటుంది. కాబట్టి మీరు కూడా ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి ఆరోగ్యకరమైన ఆహారాలు కలిగిన డైట్ ని పాటించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలను నియంత్రించుకోవడానికి తప్పకుండా జీవనశైలిలో కూడా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు ప్రతిరోజు ఈ క్రింది ఆహారాలను తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?  


శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలను యాపిల్ పండ్లు ప్రభావంతంగా నియంత్రిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. యాపిల్‌లో ఉండే పాలీఫెనాల్ సమ్మేళనం కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంతో పాటు మంచి కొలెస్ట్రాల్‌ను పెంచేందుకు సహాయపడతాయి. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా బరువును కూడా తగ్గించేందుకు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


శరీరంలోని కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగితే ఆహారంలో తప్పకుండా వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది ఇందులో ఉండే యాసిడ్స్ కొలెస్ట్రాల్ను వేగంగా తగ్గించేందుకు సహాయపడతాయి. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం కూడా అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి ప్రతిరోజు వెల్లుల్లిని ఆహారంలో వినియోగించడం వల్ల సులభంగా బరువు కూడా తగ్గుతారు. అంతేకాకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు.    


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook