COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Reduce High Cholesterol With Dragon Fruit: అతిగా ఆయిల్ ఫుడ్స్‌ తీసుకునేవారు తరచుగా అనారోగ్య సమస్య బారిన పడుతూ ఉంటారు. దీంతో పాటు కొందరిలో రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం అధికంగా పెరుతున్నాయి. దీని కారణంగా రక్తపోటు సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే శరీరానికి మరింత నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయిన వారు వ్యాయామాలు చేయడమే కాకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇలా చేయడం వల్లే సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా మీరు రోజు తీసుకునే ఆహారాల్లో డ్రాగన్ ఫ్రూట్ మిక్స్‌ చేసి తీసుకుంటే వేగంగా కొలెస్ట్రాల్ తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే డ్రాగన్ ఫ్రూట్‌ను రోజు ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


డ్రాగన్ ఫ్రూట్ లాభాలు:
డ్రాగన్ ఫ్రూట్ మార్కెట్‌లో రెండు రకాలుగా లభిస్తుంది. ఒకట రకం ఫ్రూట్‌లోని లోపలి భాగం గులాబీ రంగులో ఉంటే..మరొక రకంలో లోపలి భాగం తెలుపు రంగును కలిగి ఉంటుంది. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. డ్రాగన్ ఫ్రూట్‌లో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ సిలు కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇవే కాకుండా ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 


చెడు కొలెస్ట్రాల్‌కు చెక్‌ పెడుతుంది:
డ్రాగన్ ఫ్రూట్‌లో చాలా తక్కువ పరిమాణంలో కొలెస్ట్రాల్‌ పరిమాణాలు లభిస్తాయి. ఇప్పటికే కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు డ్రాగన్ ఫ్రూట్‌ను అల్పాహారంలో తీసుకోవాలి. అంతేకాకుండా ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు ముఖ్యమైన పోషకాలు కూడా అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తీసుకోవడం వీటిని అల్పాహారంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 


Also Read: AP Politics: చంద్రబాబుతో మంచు మనోజ్ దంపతుల కలయిక, మతలబు అదేనా


గుండె జబ్బుల నుంచి ఉపశమనం:


ఫైబర్‌ అధిక పరిమాణంలో ఉండే పండ్లలో డ్రాగన్ ఫ్రూట్‌ ఒకటి. అయితే ఈ పండుతో తయారు చేసిన జ్యూస్‌ను ప్రతి రోజు తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గి.. కరోనరీ ఆర్టరీ డిసీజ్, కార్డియోవాస్కులర్ డిసీజ్ రిస్క్ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇందులో అధిక పరిమానంలో ఫైబర్ లభిస్తుంది. కాబట్టి సులభంగా శరీర బరువుతో పాటు కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా తరచుగా గుండె సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ పండుతో తయారు చేసిన జ్యూస్‌ని తాగాల్సి ఉంటుంది. 


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: AP Politics: చంద్రబాబుతో మంచు మనోజ్ దంపతుల కలయిక, మతలబు అదేనా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook