Benefits of Dragon Fruit: కొలెస్ట్రాల్ పరిమాణాలు అధికంగా ఉండే ఆహారాలను విచ్చలవిడిగా తీసుకోవడం వల్ల చాలా మందిలో కొలెస్ట్రాల్ సమస్యలు వస్తున్నాయి. అయితే దీని కారణంగా ప్రాణాంతక వ్యాధులైన గుండెపోటు మధుమేహం ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన కూడా పడుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చెడు జీవనశైలి ని కరించకపోవడం మంచిదని కూడా సూచిస్తున్నారు. వట్టి చెడు కొలెస్ట్రాల్ సమస్యలు ఎదుర్కొంటున్న వారు తప్పకుండా ఆరోగ్యకరమైన పచ్చి కూరగాయలతో పాటు.. ఫ్రూట్స్ ను కూడా ప్రతిరోజు ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పోషకాలు అధిక పరిమాణంలో ఉండే డ్రాగన్ ఫ్రూట్స్ ప్రతిరోజు తీసుకోవడం వల్ల సులభంగా కొలెస్ట్రాల్ను నియంత్రించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డ్రాగన్ ఫ్రూట్ ప్రతిరోజు పోవడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు:


గుండెపోటు సమస్య..
చెడు కొలెస్ట్రాల్ సమస్యల వల్ల ఉత్పన్నమయ్యే వ్యాధుల్లో అతి తీవ్రమైన సమస్య గుండెపోటు. చిన్న పెద్ద తేడా లేకుండా గుండెపోటు బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఒత్తిడి అనారోగ్యకరమైన ఆహారాలను విచ్చలవిడిగా తీసుకోవడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించి కొలెస్ట్రాల్ పరిమాణాలను తగ్గించుకునేందుకు డ్రాగన్ ఫ్రూట్ ను ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరానికి పోషకాలను అందజేయడమే కాకుండా దృఢంగా చేసేందుకు సహాయపడుతుంది. 


చెడు కొలెస్ట్రాల్ సమస్యలకు..
డ్రాగన్ ఫ్రూట్స్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధిక పరిమాణంలో ఉంటాయి కాబట్టి శరీరంలో కొలెస్ట్రాలను తగ్గించి పెరుగుతున్న బరువును కూడా సులభంగా నియంత్రిస్తుంది. ముఖ్యంగా శరీర బరువు సమస్యలతో బాధపడుతున్న వారు డైట్ పద్ధతిని పాటించే క్రమంలో తప్పకుండా డ్రాగన్ ఫ్రూట్ ను నేర్చుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పరిమాణాలు అధికంగా లభిస్తాయి. కాబట్టి ఎలాంటి అనారోగ్య సమస్యలైనా సులభంగా నియంత్రిస్తుంది.


రోగ నిరోధక శక్తి..
శరీరం ఆరోగ్యవంతంగా ఉండడానికి తప్పకుండా రోగ నిరోధక శక్తి అవసరమవుతుంది. కాకుండా తీవ్రమైన వ్యాధులు సోకకుండా రోగ నిరోధక శక్తి బాడీ సంరక్షిస్తుంది. శరీరానికి రోగనిరోధక శక్తి చాలా అవసరం.. అయితే ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది రోగనిరోధక శక్తిని కోల్పోతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు డ్రాగన్ ఫ్రూట్ ను ఆహారంతో పాటు తీసుకోవాల్సి ఉంటుంది.


Also Read: Diabetes Control Tips: ప్రతి రోజూ ఈ 5 నియమాలు పాటిస్తే మధుమేహం జీవితంలో రాదు, ఉన్నవారికి దిగి రావడం ఖాయం!


Also Read: Naatu Naatu Oscar Journey: ఆర్ఆర్ఆర్ ఆస్కార్ జర్నీ వెనుక ఎం జరిగింది, కారణాలేంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook