Naatu Naatu Oscar Journey: ఆర్ఆర్ఆర్ ఆస్కార్ జర్నీ వెనుక ఎం జరిగింది, ఎఫ్ఎఫ్ఐ వెటకారానికి దీటైన సమాధానం లభించిందా

Naatu Naatu Oscar Journey: తెలుగోడి సత్తా చాటిన నాటు నాటు పాట ఆస్కార్ ఎంపిక అంత సులభంగా  జరగలేదు. దేశంలోని గుజరాతీ రాజకీయాల్ని దాటుకుని మరీ విజయం సాధించింది. వెటకారం చేసిన వారికి నాటైన సమాధానమే ఇచ్చింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 13, 2023, 10:39 AM IST
Naatu Naatu Oscar Journey: ఆర్ఆర్ఆర్ ఆస్కార్ జర్నీ వెనుక ఎం జరిగింది, ఎఫ్ఎఫ్ఐ వెటకారానికి దీటైన సమాధానం లభించిందా

Naatu Naatu Oscar Journey: అందరూ ఊహించినట్టే..అందరి అంచనాలు చేరుకుంటూ సినీ ప్రపంచపు అత్యున్నత పురస్కారాన్ని ఆర్ఆర్ఆర్ సినిమా అందుకుంది. ప్రపంచాన్ని హోరెత్తించిన నాటు నాటు పాటకు అరుదైన గౌరవం లభించింది. నాటు నాటు ఆస్కార్ వరకూ వెళ్లిన ప్రస్థానం వెనుక చాలా కారణాలున్నాయి..

గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకోవడం ఆ తరువాత బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగరీలో ఆస్కార్ తుది నామినేషన్లలో నిలవడం ఆర్ఆర్ఆర్ సినిమాకు అంత సులువుగా కాలేదు. 130 మంది భారతీయులు గర్వపడేలా తెలుగోడు తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా పాటను ఆస్కార్ వరించడం వెనుక చాలా వ్యవహారం సాగింది. ప్రపంచం మొత్తం నాటు నాటు పాటకు మైమరచి స్టెప్పులేశారు. డోల్బీ థియేటర్‌లో రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ లైవ్ ప్రదర్శనకు ధియేటర్ మార్మోగిపోయింది. 

రాజమౌళి దర్శకత్వం, కీరవాణి సంగీతం, చంద్రబోస్ సాహిత్యం, రాంచరణ్ జూనియర్ ఎన్టీఆర్ నటన అన్నీ ఆ సినిమాను అగ్రస్థానంలో నిలబెట్టాయి. వాస్తవానికి ఆర్ఆర్ఆర్ సినిమా భారతదేశం తరపున షార్ట్ లిస్ట్ అయిన సినిమాల జాబితాలో లేదు. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యూరీ సభ్యులు ఈ చిత్రానికి మొండి చేయి చూపారు. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఎంపిక చేసేందుకు గుజరాతీ రాజకీయాలు నడిచాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. గుజరాత్‌కు చెందిన చెల్లో షో చిత్రాన్నిఆస్కార్‌కు షార్ట్ లిస్ట్ చేసింది ఎఫ్ఎఫ్ఐ. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన ఈ సినిమా ఎఫ్ఎఫ్ఐ కంటికి ఎందుకు నచ్చలేదనే విషయంపై చాలా విమర్శలు రేగాయి.

ఆర్ఆర్ఆర్ సినిమాను షార్ట్ లిస్ట్ చేయకపోవడంపై ఎఫ్ఎఫ్ఐపై విమర్శలు వచ్చాయి. మార్కెటింగ్ స్ట్రాటెజీ, పాపులారిటీ, వినోదం, కలెక్షన్స్ ఆధారంగా ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్ చేయాలా అని వెటకారంగా సమాధానమిచ్చింది ఎఫ్ఎఫ్ఐ. దాంతో బాహుబలి నిర్మాత యార్లగడ్డ శోభు విదేశీ ఎంట్రీతో గట్టి ప్రయత్నం చేశారు. ఫలితంగా నామినేట్ అవడమే కాకుండా..చివరి వరకూ నిలిచి..చరిత్ర సృష్టించింది. ఇదిలా ఉంటే..ఆర్ఆర్ఆర్ సినిమాను పక్కనబెట్టి ఎంపిక చేసిన గుజరాతీ సినిమా చెల్లో షో కనీసం ఆస్కార్ ఎంట్రీ పొందలేకపోయింది. 

Also read: Oscars 2023: ఆస్కార్ బరిలో గెలిచిన చిత్రాలు, ఆ ఒక్క చిత్రానికే 4 ఆస్కార్ అవార్డులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News