Tips To Stay Slim And Fit In Winters: చలికాలంలో శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం అనేది ఒక సవాలు. ఈ సీజన్‌లో చాలా మందిలో రోగ నిరోధక శక్తి తగ్గి శరీరంలో బద్ధకం ఎక్కువగా పెరుగుతుంది. వింటర్ సీజన్‌లో డైట్ మార్చుకోవడం వల్ల కూడా శరీరం ఫిట్‌ తగ్గి బరువు వేగంగా పెరుగుతారని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే చాలా మంది ఈ చలికాలంలో వివిధ రకాల నూనెతో కూడిన చిరు తిండ్లు ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే దీని వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ కింది చిట్కాలను వినియోగిస్తే సులభంగా శరీరాన్ని  స్లిమ్‌గా, ఫిట్‌గా ఉంచుకోవచ్చు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చలి కాలంలో బరువుకు ఎలా చెక్‌ పెట్టొచ్చు:


1. ఆరోగ్య నిపుణులు చలికాలంలో శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన అల్పాహారం తినాలని సూచిస్తున్నారు. ఉదయం నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత 3 గంటలలోపు అల్పాహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకుంటే రోజంతా మీకు శక్తిని ఇవ్వడమేకాకుండా అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది.


2.  స్వీట్లను ఇష్టపడి, మళ్లీ మళ్లీ తింటూ ఉంటున్నారు. అయితే ఈ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి తక్కువ పరిమాణంలో మాత్రమే స్వీట్‌. దీనితో పాటు, మీరు తినే స్వీట్లలో సహజ స్వీటెనర్ ఉపయోగించండి. బెల్లం మరియు ఖర్జూరాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టండి.  


3. రాత్రి నిద్రపోయే ముందు తప్పకుండా తేలికపాటి ఆహారాలను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. రాత్రి పడుకునే  3 గంటల ముందే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా రాత్రి సులభంగా జీర్ణమయ్యే అహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆరోగ్యమైన ఆహారాలను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.


4. బరువు తగ్గడానికి తప్పకుండా పడుకునే ముందు గోరు వెచ్చని నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా నీటిని తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ కూడా తగ్గుతుంది. అంతేకాకుండా ఈ క్రమంలో సులభంగా బరువు తగ్గడానికి అల్లం టీని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టీని తీసుకోవడం వల్ల శరీరం నుంచి వ్యాధులు కూడా దూరమవుతాయి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 



Also Read: Ind Vs Zim: జింబాబ్వేతో భారత్‌ పోరు నేడే.. తేలనున్న సెమీస్‌ బెర్తులు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి