శృంగారం..  మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.. ఒంట్లో కొవ్వును కరిగిస్తుంది.. ఇది నిన్నటి మాట. కానీ తాజాగా మరో కొత్త ఉపయోగం వచ్చి చేరింది. అదేమిటంటే, శృంగారంతో తెలివితేటలు కూడా పెరుగుతాయట. మెదడులో ఉండే హిప్పోక్యాంపస్ అనే ప్రాంతంలో కొత్త న్యూరాన్లు ఏర్పడేందుకు శృంగారం ఎంతగానో ఉపయోగపడుతుందని తాజా పరిశోధనలలో తేలింది. తరచూ లైంగిక కార్యకలాపాలలో  పాల్గొనడం వల్ల మెదడులో దీర్ఘకాలిక జ్ఞాపకాలకు నెలవైన హిప్పోక్యాంపస్ ప్రాంతంలో అధిక సంఖ్యలో కొత్తనాడులు పుట్టుకొస్తాయని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ పరిశోధకులు చేసిన తాజా అధ్యయనం తెలిపింది. అంతేకాదు.. సుదీర్ఘకాలంపాటు శృంగారానికి దూరంగా ఉంచిన లేబొరేటరీ ఎలుకల మెదడులోని నాడుల సంఖ్య తగ్గిపోవడమూ వారు గమనించారట.సెక్స్‌లో ఎక్కువగా పాల్గొనడం వల్ల మెదడుకు ప్రాణవాయువు ఎక్కువగా చేరడమే ఇందుకు కారణమని వారు వెల్లడించారు. 


అలాగే, దక్షిణ కొరియాలోని కొంకుక్ విశ్వవిద్యాలయము చేసిన పరిశోధనలలో కూడా ఇలాంటి విషయమే రుజువైంది. శృంగారం వల్ల తెలివితేటలు పెరుగుతాయని, దీనివల్ల హిప్పోక్యాంపస్ ప్రాంతంలో న్యూరాన్లు కొత్తవి వస్తాయని వీళ్లు కూడా చెప్పారు. విపరీతమైన ఒత్తిడి కారణంగా మతిమరుపు వస్తే, తగ్గించడానికి ఈ న్యూరాన్లు ఉపయోగపడతాయి. వయసులో ఉన్నప్పుడు ఎక్కువగా శృంగారంలో పాల్గొన్న జంటల్లో.. పెద్దయ్యాక మతిమరుపు వచ్చే అవకాశం చాలా తక్కువని వాళ్లు తేల్చి చెప్పారు.