Sage Leaves For Diabetes: మధుమేహంతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ ఆకులను తినండి..!
Sage Leaves For Diabetes: ప్రస్తుత మధుమేహం వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా పెచ్చరిల్లుతోంది. రోజురోజూకు ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య అధికమవుతోంది. ముఖ్యంగా భారత్‌లో మధుమేహం వ్యాధి సంఖ్య పెరగడం అందరినీ గుబులు పుట్టిస్తోంది.
Sage Leaves For Diabetes: ప్రస్తుత మధుమేహం వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా పెచ్చరిల్లుతోంది. రోజురోజూకు ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య అధికమవుతోంది. ముఖ్యంగా భారత్‌లో మధుమేహం వ్యాధి సంఖ్య పెరగడం అందరినీ గుబులు పుట్టిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలు భారత్‌ను 'డయాబెటిస్ క్యాపిటల్' అని పిలుస్తున్నారు. అయితే డయాబెటిక్ రోగిలలోని రక్తంలో చక్కెర నియంత్రణలో ఉండక పోవడంలో ప్రాణాంతక వ్యాధిగా మారుతోంది. ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి పలు రకాల మార్గాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మధుమేహాన్ని అదుపులో ఉండాలంటే ఏం చేయాలి..?:
ఎన్నో ఔషధ గుణాలు కలిగిన పలు రకాల దివ్యౌషధాల గురించి మనం తెలుసుకోబోతున్నాం..! దీనిని వినియోగించడం వల్ల శరీరంలోని రక్తంలో చక్కెర నియంత్రణగా ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. ఆ దివ్యౌషధాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సేజ్ ఆకులను ఉపయోగించండి:
ఆధునిక జీవన శైలి కారణంగా చిన్న వయసులోనే మధుమేహం వంటి వ్యాధులకు గురవుతున్నారు. అంతేకాకుండా కొందరిలో రక్తంలో చక్కెర స్థాయి పెరిగి.. కళ్ళు, గుండె, మూత్రపిండాలు, కళ్ళు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే దీని నుంచి విముక్తి పొందడానికి 'సేజ్' అనే ఆకులను వినియోగించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నార.
సేజ్ ఆకులలో లభించే పోషకాలు:
సేజ్ ఆకులలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిని సాధారణంగా మసాలాగా ఉపయోగిస్తారు. అయితే ఇదంలో మన ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని పోషకాలు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ప్రొటీన్లు, మెగ్నీషియం, క్యాల్షియం, జింక్, పొటాషియం, విటమిన్ బి, విటమిన్ సి లు ఉంటాయి. ఇవి మధుమేహాన్ని నియంత్రించడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతాయి.
సేజ్ ఆకుల ప్రయోజనాలు:
- మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని తింటే.. వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రిణలో ఉంటాయి.
- ఈ ఆకులు వల్ల ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు దూరమవుతాయి.
- వయసు పెరిగే కొద్దీ అల్జీమర్స్ వంటి వ్యాధులకు గురవుతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ ఆకులను తినండి.
- సేజ్ ఆకులను క్రమం తప్పకుండా తీసుకుంటే.. పెరుగుతున్న బరువును నియంత్రణలో ఉంచుతుంది.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Fathers Day 2022: ఇవాళ ఫాదర్స్ డే.. అసలు ఇది ఎలా మొదలైంది, దీని ప్రాముఖ్యత ఏంటో మీకు తెలుసా
Also Read: Weight Loss Tips: టిఫిన్‌గా శనగపిండితో చేసిన వీటిని తినండి.. శరీరానికి చాలా శక్తిని ఇస్తుంది.!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook