Seeds Reduces Bloating: కడుపు సమస్యలు వస్తే ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే ఇది శరీరం ఆరోగ్యంపై ఇంత ప్రభావం చూపుతుంది కడుపులో ముఖ్యంగా జీర్ణక్రియ మెరుగ్గా ఉంటేనే అన్ని పనులు సులభతరం అవుతాయి. తిన్న ఆహారం సరిగ్గా చేయడం కాకపోతే కడుపులో అజీర్తి మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. అయితే ఇంట్లో ఉండే కొన్ని గింజలతో కడుపులో అజీర్తి సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు అవి ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అజీర్తి సమస్య వచ్చినప్పుడు కడుపు నిండుగా గట్టిగా మారిపోతుంది. దీంతో గ్యాస్ సమస్యలు కూడా వస్తాయి కడుపులో నొప్పి కూడా వస్తుంది,  ఇది ఆహార జీవనశైలి సరిగ్గా పాటించకపోవడం దీనికి ప్రధాన కారణం అంతేకాదు హార్మోనల్ మార్పులు కూడా కారణం అవుతుంది. కడుపులో అజీర్తి సమస్య రాకుండా ఉండాలంటే ముందుగా తినే ఆహారంపై శ్రద్ధ వహించాలి అయితే ఐదు రకాల గింజలతో కూడా కడుపులో అజీర్తి సమస్యను తక్షణమే చెక్‌ చెబుతాయి. 


సోంపు..
సోంపులో క్యార్మినేటీట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కడుపులో గ్యాస్ అజీర్తిని తగ్గించేసి జీర్ణ క్రియలకు ఉపశమనం కలిగిస్తాయి, కండరాలను నయం చేస్తాయి. గ్యాస్ సమస్య రాకుండా కాపాడుతుంది
ఈ సోంపు గింజలను భోజనం చేసిన తర్వాత నేరుగా నమలవచ్చు .లేకపోతే వేడినీటిలో వేసుకొని కాసేపు ఉడికించి టీ రూపంలో కూడా తీసుకోవచ్చు.


షాజీర..
షాజీర ఇది ఇంట్లో మసాలా డబ్బాలో కచ్చితంగా ఉంటుంది. ఇది కూడా కడుపులో అజీర్తి సమస్యకు చెక్‌ పెడుతుంది, జీర్ణ క్రియను వేగవంతం చేస్తుంది, గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం షాజీరా గింజలను నేరుగా నమలవచ్చు లేకపోతే టీ రూపంలో కూడా తీసుకోవచ్చు.


ఇదీ చదవండి: వర్షా కాలంలో ఈ ఆహారాలు తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త!


జీలకర్ర..
జీలకర్రలో కూడా డైజెస్టివ్ ఎంజైమ్స్‌ వేరు చేసే గుణం కలిగి ఉంటుంది ఇది జీర్ణ క్రియను మెరుగు చేస్తుంది కడుపులో గ్యాస్ సమస్యకు అజీర్తిని తగ్గిస్తుంది. ఈ జీలకర్రను మనం వివిధ వంటలు ఉపయోగిస్తాం వీటిని నీటిలో వేసుకుని కూడా తీసుకోవచ్చు నేను జీలకర్ర నీటిని నీటిని వేడి చేసి జీలకర్ర వేసి తీసుకోవాలి


చియా సీడ్స్..
చియా గింజలు కూడా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, పేగు అనే కదలికలకు తోడ్పడుతుంది. మలబద్ధకం సమస్య రాకుండా అజీర్తిని దరి చేరనివ్వదు. ఈ చియా గింజలను పాలు లేదా నీళ్లలో వేసుకుని తీసుకోవచ్చు యోగార్ట్‌లో కూడా వేసుకొని తింటారు.


ఇదీ చదవండి: బియ్యంపిండితో ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలను సులభంగా తొలగించుకోండి..


అవిసె గింజలు..


అవిసె గింజలు కూడా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగు చేసి అజీర్తి సమస్య రాకుండా చేస్తుంది ముఖ్యంగా పేగు కదలికలకు తోడ్పడి మంచి బ్యాక్టిరియా పెరిగేలా చేస్తుంది. ఫ్లాక్ సీడ్స్ ని కూడా ఆహారాల్లో తీసుకోవచ్చు. అవిసెగింజలు డైట్లో చేర్చుకుంటే నీరు కూడా ఎక్కువగా తీసుకోవాలని గుర్తుంచుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి