Side effects of COVID-19 | కరోనావైరస్ సోకి నయమైన తర్వాత దగ్గు, జ్వరం, బాడీ పెయిన్స్, నాడీ వ్యవస్థ సమస్యలు, తల పట్టేసినట్టు ఉండటం, ఆకలి లేకపోవడం, అలసట, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడం వంటి సమస్యలే చాలా మందికి తెలిసినవి... చాలా మంది చెప్పుకుంటున్నవి. కానీ, అతిసారం, అజీర్ణం, కాలేయం వాపు, షుగర్ లెవెల్స్ పడిపోవడం, ప్యాంక్రియాస్ వంటి ఎన్నో కంటికి కనిపించని జీర్ణ సంబంధిత సమస్యలు ( Symptoms post-COVID-19 ) గురించి చాలా మందికి తెలియడం లేదు అంటున్నారు వైద్య నిపుణులు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరీ ముఖ్యంగా Coronavirus తీవ్రంగా సోకిన క్రిటికల్ పేషెంట్స్‌, సీనియర్ సిటిజెన్స్‌లో 30 % మంది కరోనా నుంచి కోలుకున్న తర్వాత జీర్ణ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారని వైద్యులు చెబుతున్నారు. యవతీ యువకులు విషయానికొస్తే.. వారిలో డయేరియా ( Diarrhoea ) వంటి తేలికపాటి జబ్బు లక్షణాలతో బాధపడుతున్నట్టు మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ( Medical experts ) తెలిపారు.


కోవిడ్ రికవరీ తర్వాత హైపర్ ఇన్సులిన్ స్రావం కారణంగా ముంబైకి చెందిన 30 ఏళ్ల వర్కింగ్ ప్రొఫెషనల్ నిషా ఖన్నా ( పేరు మార్చబడింది) చెంబూర్‌లోని జెన్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో చేరారు. ఆమె రక్తంలో షుగర్ లెవెల్స్ ( Sugar levels ) పడిపోతుండటాన్ని డాక్టర్స్ గుర్తించారు. ఆమె ప్యాంక్రియాటిక్ కణితితో బాధపడుతుందా అనే అనుమానం రావడంతో అది నిజమా కాదా అని నిర్ధారించుకునేందుకు మరిన్ని వైద్య పరీక్షలు చేశారు. 


Also read : COVID-19 vaccine తీసుకుంటే ఇక పిల్లలు పుట్టరా ?


మెడికల్ టెస్టుల అనంతరం ఆమె స్వయం ప్రతిరక్షక ప్రతిస్పందన ( Autoimmune response ) అనే అరుదైన సమస్యతో బాధపడుతున్నట్టు నిర్ధారించుకున్నారు. ఈ సమస్య వల్ల కలిగే ఇబ్బంది ఏంటంటే.. శరీరం చాలా ఎక్కువ ఇన్సూలిన్ ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా హైపోగ్లైసీమియా, విపరీతంగా చమట పట్టడం, షుగర్ లెవెల్స్ పడిపోవడం, విరేచనాలు వంటి ఇబ్బందులు తప్పలేదని డాక్టర్స్ గుర్తించారు. 


నిషాకు Medication లేకుండా ( మందులు లేకుండా ) ఏ రోజుకు ఆ రోజు Sugar levels ను గమనిస్తూ చికిత్స ఇస్తూ వచ్చారు. 3 నెలల తర్వాత పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశిస్తూ ఆమెను రెగ్యులర్ ఫాలో-అప్స్ కోసం ఆస్పత్రికి రమ్మని కోరినట్టు నిషాను కోరినట్టు డాక్టర్స్ తెలిపారు. కానీ నిషా షుగర్ లెవెల్స్ 30 mg / dL కన్నా తక్కువకు పడిపోతే.. ఆమెకు మూర్ఛ రావడం జరుగుతుందని, ఇంకొన్నిసార్లు అది ఆమె ప్రాణంపైకి సైతం తీసుకొస్తుందని డాక్టర్స్ వెల్లడించారు. ఈ సమస్యలన్నింటికీ కారణం శరీరంలోకి ప్రవేశించిన Coronavirus ఊపిరితిత్తులు, శ్వాసనాళాల నుంచి తొలగిపోయిన తర్వాత మళ్లీ జీర్ణవ్యవస్థలో ప్రతిబింబిస్తుండటమేనని డాక్టర్స్ అభిప్రాయపడుతున్నారు.


Also read : Headache with COVID-19: కరోనాతో వచ్చే తలనొప్పికి, సాధారణ తలనొప్పికి మధ్య తేడాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook