Single dose vaccine from Johnson & Johnson: కరోనావైరస్ నివారణ కోసం ప్రస్తుతం కొవిడ్ వ్యాక్సిన్లను ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ అంటూ రెండు విడతల్లో వ్యాక్సిన్ తీసుకోవడంలో తలెత్తుతున్న ఇబ్బందులను అధిగమించే ఉపాయం త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఆ ఉపాయం పేరే సింగిల్ డోస్ వ్యాక్సిన్. అవును.. త్వరలోనే సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. తాజాగా భారత్‌లో సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్ (Single dose Corona vaccine) అత్యవసర వినియోగానికి అనుమతించాల్సిందిగా కోరుతూ జాన్సన్ అండ్ జాన్సన్ కేంద్రానికి దరఖాస్తు చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ జాన్సెన్ (Janssen single dose vaccine) పేరిట తయారు చేసిన సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ శుక్రవారం కేంద్రానికి దరఖాస్తు చేసుకుంది. కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలకు చెందిన ప్రముఖ వ్యాక్సిన్ల కంపెనీలకు ట్రయల్స్ అవసరం లేకుండానే అత్యవసర వినియోగానికి అనుమతించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. 


భారత్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనావైరస్ సెకండ్ వేవ్ (Corona second wave) కట్టడితో పాటు థర్డ్ వేవ్ నివారణకు కరోనావైరస్ సింగిల్ డోస్ కీలక పాత్ర పోషిస్తుందని జాన్సన్ అండ్ జాన్సన్ అభిప్రాయపడింది.