Monsoon Health Tips: వర్షాకాలంలో చర్మంపై దద్దుర్లు, దురద సమస్యగా ఉందా..ఈ మూడు చిట్కాలతో మటుమాయం
Monsoon Health Tips: వర్షాకాలం వస్తూనే..చర్మ సంబంధిత సమస్యలు వెంటాడుతుంటాయి. చర్మంపై దద్దుర్లు రావడం, దురద వంటి ఇబ్బందులు కలుగుతుంటాయి. ఈ సమస్యల్ని ఎలా ఉపశమనం పొందాలో తెలుసుకుందాం..
Monsoon Health Tips: వర్షాకాలం వస్తూనే..చర్మ సంబంధిత సమస్యలు వెంటాడుతుంటాయి. చర్మంపై దద్దుర్లు రావడం, దురద వంటి ఇబ్బందులు కలుగుతుంటాయి. ఈ సమస్యల్ని ఎలా ఉపశమనం పొందాలో తెలుసుకుందాం..
వర్షాకాలంలో సహజంగానే అనారోగ్య సమస్యలు ఎక్కువ. వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులు చుట్టుముడుతుంటాయి. మరోవైపు చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వర్షపు నీరు, ఉక్కపోత, చెమట కారణంగా చర్మంపై దద్దుర్లు, దురద ప్రధానంగా కన్పిస్తుంటుంది. అయితే కొన్ని వంటింటి చిట్కాలతో సులభంగానే ఈ సమస్యల్నించి గట్టెక్కవచ్చంటున్నారు చర్మ వైద్య నిపుణులు. ఆ వివరాలు మీ కోసం..
మీకు కూడా చర్మ సంబంధిత సమస్యలు, చర్మంపై దురద ఉంటే నిమ్మకాయ, బేకింగ్ సోడా సహాయంతో ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ముందుగా స్నానానికి ముందు ఒక స్పూన్ బేకింగ్ సోడాలో నిమ్మరసం పిండుకుని..మిశ్రమంగా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్నానానికి ముందు మొత్తం బాడీకు అప్లై చేసి 15-20 నిమిషాలుంచాలి. ఆ తరువాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల దురద సమస్యల్నించి విముక్తి పొందవచ్చు.
ఇక మరో చిట్కా వేప. వేప శరీరాన్ని చాలా రకాల సమస్యల్నించి దూరం చేస్తుంది. దురద సమస్యను దూరం చేసేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. ఒక గిన్నెలో నీళ్లు వేడి నీళ్లు తీసుకోవాలి. అందులో వేపాకులు వేసి..నార్మల్ నీళ్లు కలిపి స్నానం చేయాలి. ఇలా వారానికి 3 సార్లు చేస్తే దురద సమస్యల్నించి గట్టెక్కవచ్చు.
ఇక మూడవ ప్రధానమైన చిట్కా కొబ్బరి నూనె. అద్భుతంగా పనిచేస్తుంది.చర్మ సంబంధిత సమస్యల్ని దూరం చేసేందుకు కొబ్బరి నూనె అద్భుతమైన ఔషధంగా చెప్పవచ్చు. సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడైనా వినియోగించవచ్చు. చర్మానికి పోషక గుణాలు అందించడమే కాకుండా..ఇన్‌ఫెక్షన్ నుంచి దూరం చేస్తుంది.
Also read: Heart Attack: గుండెపోటు వచ్చినప్పుడు ముందుగా ఏం చేస్తే రోగి ప్రాణం నిలబడుతుంది.
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook