Skin Problems: వర్షాకాలంలో సాధారణంగా చర్మం ఆయిలీగా ఉండటం, చికాగ్గా ఉండటం ప్రధానమైన సమస్యలు. ముఖంపై పింపుల్స్,యాక్నే కూడా వర్షాకాలంలోనే కన్పిస్తుంటాయి. ఇలా వివిధ రకాల చర్మం సంబంధిత సమస్యలు వేధిస్తుంటాయి. ఈ ఫేస్ ప్యాక్ సహాయంతో ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చు. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వర్షాకాలంలో చర్మం జిడ్డుగా ఉండటం, ఇరిటేటింగ్ కల్గిస్తుండటంతో పాటు ముఖంపై పింపుల్స్ వంటివి ఏర్పడుతాయి. దీంతోపాటు వైట్ హెడ్, బ్లాక్ హెడ్, ఓపెన్ పోర్సిస్ సమస్య కూడా ఉంటుంది. ఈ సమస్యల్నించి విముక్తి పొందేందుకు మార్కెట్‌లో చాలా రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ ఉత్పత్తులు ఎంత ఖరీదైనవో అంతే హాని కల్గించేవి కూడా. ఈ నేపధ్యంలో ఆయిలీ స్కిన్ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు అత్యంత శక్తివంతమైన ఫేస్ మాస్క్ గురించి తెలుసుకుందాం. ఈ ఫేస్ మాస్క్ సహాయంతో ఆయిలీ స్కిన్ సమస్య, ముఖంపై మచ్చలు మరకలు అన్నీ తొలగించుకోవచ్చు.


దీనికోసం అల్లోవెరా జెల్‌ను ముఖం, మెడ భాగంలో బాగా రాసుకోవాలి. దాదాపు 15 నిమిషాల తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకరోజు చేస్తే సరిపోతుంది. ఆయిలీ స్కిన్ సమస్య నుంచి విముక్తి పొందేందుకు మరో మంచి పరిష్కారం పెరుగు.  దానిని ముఖానికి రాసుకుని 15-20 నిమిషాలు ఉంచుకుని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మీ ముఖం మిళమిళలాడిపోతుంది. చర్మానికి మంచి నిగారింపు వస్తుంది. ఇక వర్షాకాలంలో ఎదురయ్యే చర్మ సంబంధిత సమస్యలు దూరం చేసేందుకు మరో సాధానం వేప పౌడర్. దీనికోసం 2 చెంచాల వేప పౌడర్, 1 చెంచా పెరుగు కలిపి పేస్ట్‌గా చేసుకోవాలి. ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. 


వర్షాకాలంలో చర్మం చికాకుగా, ఆయిలీగా మారుతుంటుంది. ఈ సమస్యను దూరం చేసేందుకు సాధ్యమైనంతవరకూ హోమ్ మేడ్ చిట్కాలతో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు ప్రయత్నించాలి. మాన్‌సూన్ ఫేస్‌ప్యాక్ చర్మ సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది. ఫేస్‌ప్యాక్ తయారీకు శెనగపిండి, పెరుగు, రోజ్ వాటర్ అవసరమౌతుంది. చర్మాన్ని పూర్తిగా నరిష్ చేయడమే కాకుండా డీప్ నరిష్ సాధ్యమౌతుంది.


మాన్‌సూన్ స్పెషల్ ఫేస్‌ప్యాక్ తయారు చేసేందుకు ముందుగా ఓ గిన్నె తీసుకోవాలి. ఇందులో 3-4 చెంచాల శెనగపిండి వేయాలి. ఇందులో 1 చెంచా పెరుగు, 2 చెంచాల రోజ్ వాటర్ అవసరం. ఈ మూడింటినీ బాగా కలుపుకుని మిశ్రమంగా చేసుకోవాలి. వర్షాకాలంలో ఈ మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది


Also read: Artificial Sweetener: ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఎంతవరకూ క్షేమం, దుష్పరిణామాలు, ప్రయోజనాలేంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook