Skin Care By Multani Mitti: ముఖాన్ని మెరిసేలా, అందంగా మార్చుకోవడానికి చాలా మంది రకరకాల చిట్కాలు పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు తమ ముఖంపై ఉండే తొలగించడానికి అనేక చర్యలు తీసుకుంటారు. వాటిలో ఒకటి ముల్తానీ మట్టి (Multani Mitti). కానీ పొడి చర్మం ఉన్నవారు కూడా ఈ మట్టిని వాడవచ్చు. దీనిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలా వాడండి
మీ ముఖం యొక్క చర్మం పొడిగా ఉంటే, మీరు తేనె మరియు ద్రాక్ష రసాన్ని కలిపి ముల్తానీ మట్టిని అప్లై చేయవచ్చు. ఇది మీ ముఖానికి తేమను అందించడంతో పాటు మీ ముఖం మెరిసేలా చేస్తోంది. 


ఎలా అప్లై చేయాలి
ముందుగా మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి. దీని తరువాత, ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ (Multani Mitti for Face pack) చేయడానికి, ఒక చెంచా ముల్తానీ మట్టి మరియు గంధపు పొడిని తీసుకోండి. దానికి కొన్ని చుక్కల రోజ్ వాటర్ వేసి పేస్ట్ లా చేయండి. దీన్ని సిద్ధం చేసిన తర్వాత, ముఖంపై అప్లై చేయండి. తర్వాత 5 నిమిషాలు ఆరనివ్వాలి. అది ఆరిపోయాక గోరువెచ్చని నీటితో కడగాలి.


ముల్తానీ మట్టి ప్రయోజనాలు
** చాలా జిడ్డుగా చర్మం ఉన్నవారు.. దీనిని అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 
** ముల్తానీ మట్టి ముఖ రంధ్రాలను కూడా తెరుస్తుంది. మీకు బ్లాక్ హెడ్స్ సమస్య ఉంటే, ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేయడం వల్ల ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది.
** దీన్ని అప్లై చేయడం వల్ల ముఖం చర్మం బిగుతుగా మారుతుంది. వేసవిలో వచ్చే టాన్ పోవాలంటే ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు కొబ్బరి నీళ్లను అందులో కలపాలి. ఇది మీ సెన్ టాన్‌ను తొలగిస్తుంది.


Also read: Waist Pain: ఈ వంటింటి చిట్కా పాటించండి... మీ నడుమ నొప్పికి చెక్ పెట్టండి 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.