Waist Pain home remedies: దాల్చిన చెక్కతో వెన్ను నొప్పి మటు మాయం.. చేయండి ఇలా!

Waist Pain: ఈ రోజుల్లో యువత ఎక్కువ మంది నడుము నొప్పి లేదా వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. మారిన జీవనశైలి, నిరంతరం ల్యాప్‌టాప్ ముందు పనిచేయడం వల్ల వారు ఈ వెన్నునొప్పి సమస్యలు ఎదుర్కొంటున్నారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 24, 2022, 04:53 PM IST
Waist Pain home remedies: దాల్చిన చెక్కతో వెన్ను నొప్పి మటు మాయం.. చేయండి ఇలా!

Waist Pain Treatment: యువతలో వెన్ను నొప్పి లేదా నడుమ నొప్పి సమస్య సర్వసాధారణమై పోయింది. జీవనశైలిలో మార్పులు, నిరంతరం ల్యాప్‌టాప్ ముందు పనిచేయడం వల్ల చాలా మందికి వెన్నునొప్పి (Waist Pain) సమస్యలు మొదలవుతాయి. కొన్నిసార్లు ఈ నొప్పి చాలా పెరుగుతుంది.  సకాలంలో చికిత్స చేయకపోతే.. వీరి  సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది.  వెన్నునొప్పిని నివారించడంలో దాల్చినచెక్క ప్రభావవంతంగా పనిచేస్తుంది. నడుమ నొప్పికి దీనిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.  

దాల్చిన చెక్కతో వెన్నునొప్పికు చెక్
వెన్నునొప్పి సమస్యలో పెయిన్‌కిల్లర్‌కు బదులు హోం రెమెడీని తీసుకోవడం చాలా మంచిది. మీరు దాల్చిన చెక్కను (Cinnamon) తీసుకోవడం ద్వారా.. మీ వెన్నునొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. 

ఎలా ఉపయోగించాలి
వెన్నునొప్పి సమస్య నుండి బయటపడటానికి, రెండు గ్రాముల దాల్చిన చెక్క పొడిలో 1 టీస్పూన్ తేనె కలపండి. అప్పుడు తినండి. మీరు దీన్ని రోజుకు కనీసం 2 సార్లు చేయాలి. ఇలా చేయడం ద్వారా మీరు త్వరలో దాని ప్రభావాన్ని చూస్తారు.

అంతేకాకుండా, మీరు దాల్చిన చెక్కతో ఆరోగ్యకరమైన పానీయాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. దీని కోసం పాన్‌లో ఒక కప్పు నీరు ఉంచండి. ఆ తర్వాత అందులో కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసి తక్కువ మంట మీద మరిగించాలి. దీని తరువాత, దానిని ఒక కప్పులో వడపోసి, ఒక చెంచా తేనెతో కలపండి. మీరు దీన్ని ఉదయం మరియు రాత్రి పడుకునే ముందు తినవచ్చు. దాల్చిన చెక్కను కొన్ని రోజుల పాటు తీసుకోవడం వల్ల వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

Also Read: Summer Vegetables: ఎండ కాలంలో ఈ కూరగాయలు తీసుకుంటే శరీరానికి ఎంతో మేలు..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News