Soy Milk Benefits: పాలు శరీరానికి చాలా రకాలు ఉపయోగపడాయి. ఇందులో పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి శరీరాన్ని దృఢంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఆవు-గేదె పాలు కాకుండా సోయాబీన్ పాలు ప్రతి రోజూ తాగడం వల్ల శరీరానికి రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. సోయాబీన్‌ను బాగా గ్రైండ్ చేసి, ఆ పొడిని పాలలో కలుపుకుని తాగడం వల్ల శరీరానికి చాలా అధిక పరిమాణంలో పోషకాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్ బి12 అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి ఈ పాలను ప్రతి రోజూ తాగడం వల్ల శరీర బలహీనత సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా శరీరం శక్తవంతంగా తయారవుతుంది. అయితే ఈ పాలను ఏ సమయాల్లో తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోయా పాలు పోషకాల నిధిగా కూడా పిలుస్తారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. అంతేకాకుండా ఇందులో పొటాషియం, సోడియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ఈ పాలను ప్రతి రోజూ తాగడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.


సోయా పాల ప్రయోజనాలు:
>>సోయాబీన్ పాలు ప్రతి రోజూ తాగితే శరీరంలో హిమోగ్లోబిన్‌ను పెంచుతాయి. ఇందులో ఫైబర్ వంటి మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి సులభంగా రక్తహీనత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
>>సోయాబీన్ పాలు బోలు ఎముకల వ్యాధి వంటి వ్యాధులతో బాధపడుతున్నవారికి ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో ఉండే విటమిన్-డి, క్యాల్షియం ఎముకలను దృఢంగా చేసేందుకు సహాయపడుతుంది.
>>బరువు తగ్గాలనుకుంటే సోయాబీన్ పాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి.
>>కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నవారు డైరీ మిల్క్‌కు బదులుగా సోయా మిల్క్ తాగాలి. ఎందుకంటే ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గించేందుకు సహాయపడుతుంది.
>>అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు గుండెను ఆరోగ్యంగా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.


వీరు సోయామిల్క్ అస్సలు తాగొద్దు:
అండాశయానికి సంబంధించిన సమస్యలు ఉన్న స్త్రీలు ఈ పాలను తాగకుండా ఉండడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని వల్ల అలెర్జీ, ఇతర చర్మ సమస్యలకు దారి తీయోచ్చు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు అస్సలు సోయా పాలు తాగొద్దు. ఇందులో ఈస్ట్రోజెన్ అధిక పరిమాణంలో లభిస్తుంది. ఇది శరీరంలో హార్మోన్లను పెంచేందుకు సహాయపడుతుంది. కాబట్టి అతిగా ఈ పాలను తాగొద్దు.


ఇది కూడా చదవండి : Revanth Reddy: పొద్దునలేస్తే రాత్రి వరకు కేటీఆర్ సినిమా వాళ్లతోనే.. సమంత సోకులు మాకొద్దు: రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు


ఇది కూడా చదవండి : Jaggareddy Interesting Comments: సీఎం కేసీఆర్‌ని కలిస్తే తప్పేంటన్న జగ్గారెడ్డి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


యాపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook