Stomach Gas Home Remedies: ఉదయాన్నే పొట్టలో గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం కలిగించే పండ్లు ఇవే!
Stomach Gas Home Remedies: పొట్టలో గ్యాస్, ఇతర పొట్ట సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ కింది ఫ్రూట్స్‌ను తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
Stomach Gas Home Remedies: ఆయుర్వేదం శాస్త్రంలో మూడు రకాల శారీరక లోపాల గురించి క్లుప్తంగా వివరించారు. మొదటిది వాత దోషం, రెండవది కఫం, మూడవది పిత్త దోషం..ఈ మూడు లోపాల్లో ఏదైనా ఒకదానితో బాధపడుతుంటే అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారీ తీయోచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ మూడు శారీరక లోపాలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఆధునిక జీవనశైలని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ జీవనశైలి పాటించేవారిలో కారణంగా అనేక రకాల పొట్ట సమస్యలు వస్తున్నాయి.
పొట్టలో గ్యాస్ రావడం కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా చాలా మందిలో ఎసిడిటీ సమస్యలు కూడా వస్తున్నాయి. దీంతో పాటు గుండెల్లో మంట సమస్య కూడా పెరుగుతోంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని పండ్లను ప్రతి రోజు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
యాపిల్ పండ్లు:
ప్రస్తుతం చాలా మందిలో ఉదయం పూట ఆల్పాహారం తీసుకోవడం వల్ల పొట్టలో గ్యాస్ తయారవుతుంది. అయితే ఇలాంట సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు అల్పాహారానికి బదులుగా యాపిల్ పండ్లను తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా మలబద్దకం, విరేచనాల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
కివి:
కివి ఫ్రూట్‌లో కూడా ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తుంది. పొట్ట సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ ఫ్రూట్‌ను తీసుకోవడం వల్ల శరీరానికి ప్రోటీన్స్ లభిస్తాయి. అంతేకాకుండా రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య కూడా పెరుగుతుంది.
జామ పండ్లు:
జామలో డైటరీ ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి దీనిని ప్రతీ రోజు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అంతేకాకుండా దీని గింజలను సరిగ్గా నమిలి తింటే పొట్ట సులభంగా శుభ్రం అవుతుంది. దీంతో పాటు మలబద్ధకం ఇతర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి