COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Sweet Potato For Weight Loss: కందగడ్డ తరచుగా ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు కందగడ్డను తినడం వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుంది. ఇందులో అధిక పరిమాణంలో ఫైబర్, ఖనిజాలతో పాటు విటమిన్లు లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా కందగడ్డను ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే ఇతర ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


మధుమేహాన్ని నియంత్రిస్తుంది:
ప్రతి రోజు కందగడ్డను తినడం వల్ల శరీరానికి తగిన పరిమాణంలో పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో గ్లైసెమిక్ సూచికను ప్రభావింతం చేసే రకాల మూలకాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు కందగడ్డను ఆహారంలో తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. అంతేకాకుండా ఇందులో అధిక మోతాదులో లభించే  ఫైబర్ పరిమాణాలు రక్తంలోని చక్కెర పరిమాణాలను కూడా నియంత్రిస్తాయి. దీంతో పాటు ఇన్సులిన్‌పై కూడా ప్రత్యేక ప్రభావాన్ని చూపుతాయి. 


గుండె సమస్యలకు:
కందగడ్డను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి అధిక పరిమాణంలో ఫైబర్, పొటాషియం లభిస్తాయి. దీని కారణంగా గుండె ఇతర సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.  అంతేకాకుండా ఇందులో లభించే ఫైబర్‌ పరిమాణాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తాయి. అంతేకాకుండా ధమనుల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. 


Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ  


జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
కందగడ్డలో లభించే ఫైబర్‌ పరిమాణాలు జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఆహార ప్రేగులను సులభతరం చేసేందుకు కూడా సహాయపడతాయి. ముఖ్యంగా మలబద్ధకం ఇతర సమస్యలతో బాధపడేవారికి కందగడ్డ ఎంతగానో మేలు చేస్తుంది. 


శరీర బరువును నియంత్రిస్తుంది:
ప్రతి రోజు కందగడ్డను తినడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా ఇందులో ఉండే ఫైబర్‌ పరిమాణాలు పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది. దీంతో పాటు జీర్ణక్రియ సమస్యలను తగ్గించి అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి తరచుగా పొట్ట సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కందగడ్డను డైట్‌లో తీసుకోవాల్సి ఉంటుంది. 


Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook