Warm water Benefits: రోజు పరగడుపున గోరు వెచ్చని నీళ్లు ఓ దివ్యౌషధమే
Warm water Benefits: రోజూ లేవగానే..పర గడుపున గోరు వెచ్చని నీరు తాగడం నిజంగా ఓ మంచి అలవాటు. రోజు క్రమం తప్పకుండా ఇలా చేస్తే సకల వ్యాధుల్ని దూరం పెట్టవచ్చు. ప్రతిరోజూ గోరు వెచ్చని నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
Warm water Benefits: రోజూ లేవగానే..పర గడుపున గోరు వెచ్చని నీరు తాగడం నిజంగా ఓ మంచి అలవాటు. రోజు క్రమం తప్పకుండా ఇలా చేస్తే సకల వ్యాధుల్ని దూరం పెట్టవచ్చు. ప్రతిరోజూ గోరు వెచ్చని నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
చల్లని నీరు తాగినంత సేపు హాయిగా ఉంటుంది. సేద తీరినట్టుంటుంది. కానీ కలిగే అనర్ధాలే ఎక్కువ. చాలా సమస్యలకు దారి తీస్తోంది. అందుకే ప్రతిరోజూ గది ఉష్ణోగ్రత అంటే గోరు వెచ్చని నీటి( Warm Water)ని తాగితే చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. రోజూ ఎంత నీరుతో అంత ఆరోగ్యమని సూచిస్తున్నారు. మహిళలు రోజుకు 2.6 లీటర్లు, పురుషులు 3.7 లీటర్లు చొప్పున తాగడం మంచిదని చెబుతున్నారు. గోరు వెచ్చని నీటిని ఉదయం వేళల్లో ఒక అలవాటుగా మార్చుకోండి.
ఇలా చేయడం వల్ల డయాబెటీస్(Diabetes), గుండె(Cardiac), ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి ఎంతో మంచిదని వైద్యులు అంటున్నారు. వేడి నీళ్లు తాగమన్నారు కదా అని బాగా మరిగిన నీళ్లు తాగడం మొదలుపెడితే.. కొత్త సమస్యలు వచ్చి పడతాయి. ఉదయం నిద్రలేవగానే.. కాలకృత్యాలు తీర్చుకోడానికి ముందే రెండు లేదా మూడు గ్లాసుల గోరు వెచ్చని నీరు తాగండి. నీటిని గడగడా తాగేయకుండా.. నోటిలోనే ఉంచుకుంటూ గుటకలు వేస్తూ తాగండి. రోజూ ఇలా చేస్తే.. తప్పకుండా మంచి ఫలితాలను చూస్తారు. మరి, రోజూ వేడి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కడుపు నొప్పి, అజీర్తి తదితర జీర్ణ సమస్యలు(Digestive problems), ఇతరాత్ర ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి ఇది మంచి ఔషదం. వేడి నీరు తాగడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఆర్థరైటీస్ సమస్యలు రాకుండా కాపాడేది వేడి నీళ్లే. ఊబకాయం, అధిక బరువు వంటి సమస్యలను సైతం వేడి నీళ్లతో అధిగమించవచ్చు. వేడి నీరు గొంతు సమస్యలను దరి చేరనివ్వకుండా కాపాడుతుంది. జలుబు, న్యూమోనియా నుంచి దూరంగా ఉంచుతుంది. దగ్గు, పడిశంతో బాధపడుతున్నవారికి కూడా వేడి నీరు మంచి మందు. వేసవి కాలంలో సైతం డిహైడ్రేడ్ సమస్య తీర్చేందుకు వేడి నీరు ఉపయోగపడుతుంది. డయాబెటీస్ ( Diabetes) ముప్పు ఉందని భయపడేవారికి వేడి నీరు మంచి ఔషదం. ఈ కరోనా సీజన్లో వేడి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మరింత మంచిది. వైరస్‌లు ప్రమాదకర బ్యాక్టీరీయాలను తరిమే శక్తి వేడి నీళ్లకు ఉంటుంది.
Also read: Coffee Benefits: ఉదయాన్నే కాఫీ తాగి వర్కౌట్ చేస్తున్నారా, ఈ ప్రయోజనాలు తెలుసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook