Coffee Benefits: ఉదయాన్నే కాఫీ తాగి వర్కౌట్ చేస్తున్నారా, ఈ ప్రయోజనాలు తెలుసుకోండి

Coffee Benefits: కాఫీ తాగుతున్నారా, అయితే మీకు శుభవార్త. అందులోనూ మీరు బరువు తగ్గాలని భావిస్తున్నారా, మీకు కాఫీ సేవించడం ద్వారా అధిక ప్రయోజన చేకూరనుంది. తాజాగా జరిపిన అధ్యయనంలో ఈ విషయం నిర్ధారించారు.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 11, 2021, 09:20 AM IST
Coffee Benefits: ఉదయాన్నే కాఫీ తాగి వర్కౌట్ చేస్తున్నారా, ఈ ప్రయోజనాలు తెలుసుకోండి

Benefits Of Coffee: మీరు ప్రతిరోజూ ఉదయాన్నే కాఫీ తాగుతున్నారా, అయితే మీకు శుభవార్త. అందులోనూ మీరు బరువు తగ్గాలని భావిస్తున్నారా, మీకు కాఫీ సేవించడం ద్వారా అధిక ప్రయోజన చేకూరనుంది. తాజాగా జరిపిన అధ్యయనంలో ఈ విషయం నిర్ధారించారు.

ఉదయం వేళ మీరు వర్కౌట్ చేయడానికి ముందు కాఫీ తాగితే కొవ్వును అధికంగా కరిగించి మీకు మరింత ఆరోగ్యాన్ని అందిస్తుందని తెలుసా. ఈ విషయాన్ని సైకాలజీ ఆఫ్ ద యూనివర్సిటీ ఆఫ్ గ్రనడా ఈ విషయాన్ని తేల్చింది. ఉదయం వేళ వ్యాయామం, వర్కౌట్ చేయడానికి అరగంట ముందు కాఫీ తాగిన వారిలో కొవ్వు అధికంగా కరిగిపోయి బరువు తగ్గడంలో ఉపకరిస్తుందని గుర్తించారు.

రీసెర్చర్లు తమ అధ్యయనంలో భాగంగా 3మిల్లీగ్రాముల కెఫైన్‌ను కొందరికి ఇచ్చారు. ఆ కాఫీ(Coffee) సేవించిన అరగంట అనంతరం వర్కౌట్, ఎరోబిక్ ఎక్సర్‌సైజ్ చేసిన వారిలో కొవ్వు అధికంగా కరుగుతుందని తేలింది. అయితే మధ్యాహ్నం, ఇతర వేళలతో పోల్చితే ఉదయం వేళ మాత్రమే కాఫీ తాగి వర్కౌట్ చేసిన వారికి మాత్రమే ఈ ప్రయోజనం కలగనుంది.

Also Read: Surgical face mask vs 5-layered mask: సర్జికల్ మాస్క్ vs N95 మాస్క్.. కరోనా నుంచి సేఫ్టీ కోసం ఏది బెటర్ ?

సైకాలజీ ఆఫ్ ద యూనివర్సిటీ ఆఫ్ గ్రనడాకు చెందిన రీసెర్చర్ షేర్స్ ఫ్రాన్సిస్కో జే అమరో గహటే పలు విషయాలు వెల్లడించారు. ఉదయం నిద్రలేచాక కాఫీ తాగిన అరగంట అనంతరం ఎరోబిక్ వ్యాయామం చేసిన వారిలో కొవ్వు కరిగినట్లు గుర్తించామని చెప్పారు. కాఫీ తాగకుండా వర్కౌట్ చేసిన వారిలో తక్కువ మోతాదులో కొవ్వు కరిగినట్లు తేల్చినట్లు వెల్లడించారు. 

ఈ అధ్యయనం వివరాలను ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ జర్నల్‌లో ప్రచురించారు. ఉదయం వేళ కాఫీ తాగిన కొంత సమయం తరువాత శారీరక శ్రమ చేసే వారిలో ఆక్సిజన్ స్థాయి అధికంగా ఉంటుందని, కొవ్వు సైతం అధికంగా కరుగుతుందని వివరించారు. మీరు కూడా బరువు తగ్గాలనుకుంటున్నారా, అయితే కాఫీ ట్రై చేసి మార్పును అందుకోండి.

Also Read: New Coronavirus Symptoms: కరోనా వైరస్ కొత్త లక్షణాలు ఇవే, కనిపిస్తే టెస్టులు తప్పనిసరి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News