Insulin Increase Leafs: డయాబెటిస్ ఫ్యామిలీ హిస్టరీ, బ్యాడ్ లైఫ్‌స్టైల్ వల్ల లేదా కొన్ని అనారోగ్య సమస్యల వల్ల వస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండవు. దీనికి ప్రధాన కారణం వారి శరీరంలో ఇన్సులిన్ సరైన స్థాయిలో ఉత్పత్తికాకపోవడం. దీనికి ఎన్నో రకాల సూదిమందులు అందుబాటులో ఉన్నాయి. రోజుకు రెండుసార్లు ఇలా మందు ఇంజెక్ట్‌ చేసుకునే వారున్నారు.  డయాబెటిస్ తో బాధపడేవారు ఎల్లప్పుడూ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించాలి లేకపోతే అది ప్రాణాంతకం అవుతుంది.  అయితే, సహజసిద్ధంగా కొన్ని రకాల ఆకులతో కూడా ఇన్సులిన్ స్థాయిని పెంచుకోవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డయాబెటిస్ జీవితంలో ఒక్కసారి వచ్చిందంటే మనిషి చనిపోయే వరకు అతన్ని వీడదు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తప్పవు. అయితే, ఎప్పటికప్పుడు షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసుకోవడం తప్ప దీనికి మనం చేసేదేమి ఉండదు. ఇలా చేయడం వల్ల ప్రాణాంతక సమస్యల నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు.రక్తంలో షుగర్ లెవల్స్ ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే.. షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. దీనికి మన ఆహార నియమాలు కీలక పాత్ర పోషిస్తాయి. లైఫ్‌ స్టైల్ మనం చేసుకునే కొన్ని మార్పలతో షుగర్ నియంత్రించవచ్చు. అవి ఏంటో తెలుసుకుందాం.



1. కలబంద..
డయాబెటిస్‌తో బాధపడేవారు కలబందను తీసుకోవాలి. ఇది సాధారణంగా అందరి ఇళ్లలో ఉండే మొక్క. అంతేకాదు వివిధ సౌందర్య ఉత్పత్తులతోపాటు మందుల్లో కూడా దీన్ని వాడతారు. అయితే, ఉదయం కలబందను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుందని అమెరికన్ నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ స్టడీలో నిరూపించబడింది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా కలబంద నియంత్రిస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు కలబందను తమ డైట్లో చేర్చుకోవాలి. ప్రస్తుతం జ్యూస్ రూపంలో కూడా కలబంద అందుబాటులో ఉంది.


ఇదీ చదవండి: ఆహారం తిన్నవెంటనే అసిడిటీ సమస్యా? ఈ 5 హోంరెమిడీస్‌తో సమస్యకు చెక్ పెట్టండి..


2. వేప ఆకులు..
షుగర్ వ్యాధిగ్రస్తులు తమ శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచాలనుకుంటే వేప ఆకును కూడా తీసుకోవచ్చు. ఇది అనేక శరీరరుగ్మతలను పోగొడుతుంది. వేప ఆకులో యాంటీ బ్యాక్టిరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఉదయం ఖాళీ కడుపుతో వేపాకును పొడి లేదా నీటి రూపంలో తీసుకోవచ్చు. మధుమేహంతో బాధపడేవారు వైద్యుల సలహాను అనుసరించి వేపాకు తీసుకోవాలి.


ఇదీ చదవండి: మీ ఇంటి కిచెన్లోనే డయాబెటిస్‌కు మందు.. ఇలా తీసుకుంటే చక్కెర స్థాయిలు పెరగవు..


3. సీతాఫలం ఆకులు..
డయాబెటిస్‌తో బాధపడేవారు సీతాఫలం ఆకులను నమలాలి. ఇది కూడా శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది. సీతాఫలం పండుతోపాటు ఆకులు ఎంతో ప్రయోజనకరమైనవి. ఇందులో రక్తంలో చక్కెరను తగ్గించే హైపోగ్లైసీమిక్ సామర్థ్యం కలిగి ఉంటుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter